Breaking News

జీ-20 సదస్సును బహిష్కరిస్తున్నాం: ట్రంప్ సంచలన ప్రకటన

Published on Sat, 11/08/2025 - 07:55

వాషిం‍గ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో జరగనున్న జీ-20 సదస్సును అమెరికా బాయ్‌కాట్‌ చేస్తున్నట్టు ట్రంప్‌ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే సమయంలో జీ-20 గ్రూప్ నుంచి దక్షిణాఫ్రికాను తొలగించాలని డిమాండ్‌ చేశారు. అయితే, ఇందుకు గల కారణాలను ట్రంప్‌ వెల్లడించారు.

అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌ మీడియా వేదికగా..‘జీ-20 సదస్సు దక్షిణాఫ్రికాలో జరగడం పూర్తిగా అవమానకరం. ఆ దేశంలో మైనార్టీలు అయిన తెల్లజాతి రైతులపై హింస, ఆస్తుల స్వాధీనం, హత్యలు జరుగుతున్నాయి. అక్కడ జరుగుతున్న దారుణాలు ప్రపంచానికి తెలియాలి. అందుకే అమెరికా జీ-20 సదస్సుల్లో అమెరికా పాల్గొనడం లేదు. జీ-20 దేశాల అధినేతల సదస్సుకు అమెరికా నుంచి ఎవరూ హాజరు కావడం లేదు. ఈ సదస్సును బహిష్కరిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు.

అయితే, ఇటీవల మియామిలో చేసిన ప్రసంగంలో దక్షిణాఫ్రికాను జీ-20 గ్రూప్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసిన ట్రంప్, తాజాగా అక్కడ జరిగే సదస్సును బహిష్కరించాలని నిర్ణయించారు. కాగా, తెల్లజాతి ఆఫ్రికన్ రైతులు దక్షిణాఫ్రికాలో దాడులకు గురవుతున్నారని, అక్కడి సర్కారు వారిని రక్షించడంలో విఫలమైందంటూ ఆరోపించారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాకు చెందిన తెల్లజాతీయుల కోసం ట్రంప్ ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టింది. వలసదారులకు ఆశ్రయం ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

ట్రంప్‌కు దక్షిణాఫ్రికా కౌంటర్‌.. 
అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోపణలను దక్షిణాఫ్రికా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తమ దేశంలో తెల్లజాతి ప్రజలు ఇప్పటికీ నల్లజాతి ప్రజల కంటే ఎక్కువ స్థాయి జీవన ప్రమాణాలతో జీవిస్తున్నారని స్పష్టం చేసింది. తెల్లజాతి రైతులపై వివక్ష, హింస జరుగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తప్పుడు సమాచారం అందినట్లు తెలిపింది.

నవంబర్ 22-23 తేదీల్లో సదస్సు.. 
ఇక, జీ-20 సదస్సు ఈ ఏడాది నవంబర్ 22-23 తేదీల్లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది. ఈ సదస్సు ఆఫ్రికా ఖండంలో జరగడం ఇదే మొదటిసారి. వాస్తవానికి ట్రంప్‌ ఇప్పటికే తాను జీ-20 సదస్సుకు హాజరు కావట్లేదని ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ హాజరవుతారని అందరూ అనుకున్నారు. కానీ, ఇప్పుడు వాన్స్ కూడా తన ప్రయాణాన్ని రద్దు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా, ఈ ఏడాది ప్రారంభంలో జీ-20 విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఆ సమావేశాన్ని కూడా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బహిష్కరించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)