Breaking News

‘మాతో ఆటలొద్దు’: బ్రిక్స్ దేశాలకు ట్రంప్‌ హెచ్చరిక

Published on Sat, 07/19/2025 - 07:48

వాషింగ్టన్‌ డీసీ: బ్రిక్స్‌ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోమారు విరుచుకుపడ్డారు. బ్రిక్స్‌లోని ఆరు దేశాలకు జూలై 6న విధించిన 10శాతం అదనపు సుంకాలను మరోమారు గుర్తుచేశారు. అమెరికన్‌ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ఏ దేశానికైనా ఇలాంటి దెబ్బే ఎదురవుతుందని ఆయన హెచ్చరించారు.

డాలర్ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ డాలర్ తన హోదాను కోల్పోతే అది ప్రపంచ యుద్ధంలో ఓడిపోయినట్లేనంటూ ఆయన వ్యాఖ్యానించారు.  ఇదే సందర్భంలో ఆయన ఆయన మరో మరోమారు బ్రిక్స్ దేశాలపై (బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా) మాటల దాడి చేశారు. ‘బ్రిక్స్’ త్వరలోనే కనుమరుగవుతుందని కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఈ సమూహంలోని దేశాలపై భాగమైన 10 శాతం అదనపు సుంకం విధించడంపై గతంలో చేసిన ప్రకటనను ఆయన పునరుద్ఘాటించారు.
 

తమ ‘జీనియస్‌ చట్టం’ అమెరికా డాలర్‌ను బలోపేతం చేస్తుందని, డాలర్‌కు మరింత ప్రాముఖ్యతను తీసుకువస్తుందన్నారు. అయితే డాలర్ ఆధిపత్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న బ్రిక్స్ అనే చిన్న సమూహం త్వరలోనే కనుమరుగుకానున్నదని ట్రంప్‌ పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాలకు తాము 10శాతం అదనపు సుంకం విధిస్తామని ప్రకటించగానే ఆ దేశాలవారు మర్నాడే సమావేశం నిర్వహించారని, అయినా తనను కలుసుకునేందుకు ఎవరూ రాలేదని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా డాలర్ హోదాను  ఎప్పటికీ కోల్పోనివ్వమని అన్నారు.  బ్రిక్స్‌లోని ఆరు దేశాలు తమ తీరు మార్చుకుంటే ఈ సమస్య సద్దుమణుగుతుందని ట్రంప్‌ పేర్కొన్నారు.

బ్రిక్స్ దేశాలు గత ఏడాది బ్రెజిల్, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాలను దాటి ఇరాన్, ఇండోనేషియాలకు సభ్యత్వాన్ని కల్పించాయి. ఇటీవల బ్రెజిల్‌లో జరిగిన బ్రిక్స్‌  శిఖరాగ్ర సమావేశంలో ఆయా దేశాధినేతలు యూఎస్‌ సైనిక, వాణిజ్య విధానాలపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ నేపధ్యంలో ట్రంప్‌ ఆయా దేశాలను టార్గెట్‌ చేసినట్లు కనిపిస్తోంది. కాగా ట్రంప్‌ 2025, జూలై 18న జీనియస్ చట్టంపై సంతకం చేశారు. ఇది ప్రపంచ డిజిటల్ కరెన్సీ విప్లంలో కొత్త అధ్యాయమని ట్రంప్‌ పేర్కొన్నారు.

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)