భారతీయుడి హత్యపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Published on Mon, 09/15/2025 - 07:18

టెక్సాస్‌లోని డల్లాస్‌లో  చోటుచేసుకున్న భారతీయుడి దారుణ హత్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తన పర్యవేక్షణలో వలస నేరస్తుల విషయంలో తమ యంత్రాంగం మృదువుగా వ్యవహరించదని తెగేసి చెప్పారు. అమెరికాను సురక్షిత ప్రాంతంగా మారుస్తామని పేర్కొన్నారు.

టెక్సాస్‌లోని డల్లాస్‌ చంద్ర నాగమల్లయ్య హత్యకు సంబంధించిన భయంకరమైన  రిపోర్టులను చూశానని, ఆయనను అతని భార్య, కుమారుని ముందు, క్యూబాకు చెందిన ఒక అక్రమ వలసదారుడు దారుణంగా తల నరికి చంపాడని ట్రంప్‌ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

నిందితుడు కోబో మార్టినెజ్‌పై పిల్లలపై లైంగిక వేధింపులు, గ్రాండ్ తెఫ్ట్ ఆటో, తప్పుడు జైలు శిక్ష తదితర నేరాలకు గతంలో అరెస్టు చేశారన్నారు. అలాంటి నేరస్తుడిని క్యూబా తమ దేశంలో ఉండాలని కోరుకోలేదన్నారు. అయితే గత అసమర్థ జో బైడెన్ పాలనలో నేరస్తుడు కోబో మార్టినెజ్‌ అమెరికాలో తలదాచుకున్నాడన్నారు.

ఇలాంటి అక్రమ వలస నేర‍స్తుల విషయంలో మృదువుగా ఉండాల్సిన సమయం ఇక ముగిసిందని, హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్, అటార్నీ జనరల్ పామ్ బోండి, బోర్డర్ జార్ టామ్ హోమన్ తదితర అధికారులు అమెరికాను మళ్లీ సురక్షితంగా తీర్చిదిద్దేందుకు అద్భుతమైన కృషి చేస్తున్నారన్నారు. అమెరికా అదుపులో ఉన్న  నేరస్తుడ్ని చట్ట అమలు సంస్థలు పూర్తి స్థాయిలో విచారిస్తాయని ట్రంప్‌ పేర్కొన్నారు.

కర్ణాటకకు చెందిన నాగమల్లయ్య(50) ఓ మోటల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. అదే చోట మార్టినెజ్‌(37) సిబ్బందిగా పని చేస్తున్నాడు. సెప్టెంబర్‌ 10వ తేదీ ఉదయం పాడైన క్లీనింగ్‌ మెషిన్‌ విషయంలో నాగమల్లయ్య, మార్టినెజ్‌ మధ్య చిన్నగొడవ జరిగింది. అయితే ఆ మందలింపును భరించలేక తన బ్యాగులో ఉన్న కత్తితో వెంటాడి మరీ మల్లయ్యను మార్టినెజ్‌ దారుణంగా హతమార్చాడు. 

ఈ క్రమంలో నాగమల్లయ్య కొడుకు(18), భార్య అడ్డుకోవాలని ప్రయత్నించినా.. వారిద్దరినీ నెట్టేసి మరీ కిరాతకంగా హతమార్చాడు. ఆపై తల నరికి కాలితో తన్ని మరీ దానిని అక్కడి చెత్త బుట్టలో పడేశారు. అనంతరం పోలీసులు హత్యా నేరం కింద అతన్ని అరెస్ట్‌ చేశారు. అయితే అతనిది నేరస్వభావమని, గతంలోనూ పలు నేరాలు చేశాడని, క్యూబా అతన్ని స్వీకరించేందుకు నిరాకరించడంతో ఇక్కడే అమెరికాలోనే ఉండిపోయాడని, ఈ ఏడాది జనవరిలో నిబంధనల ప్రకారం విడుదల చేయాల్సి వచ్చిందని అక్కడి అధికారులు తెలిపార.

 

ఈ ఘటనపై భారత కాన్సులేట్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందజేస్తామని ప్రకటించింది. మరోవైపు భారతీయ కమ్యూనిటీ  ఫండ్‌ రైజింగ్‌ ద్వారా విరాళాలు సేకరించి నాగమల్లయ్య కుటుంబానికి అందజేసింది. సెప్టెంబర్‌ 13వ తేదీ నాగమల్లయ్యకు అక్కడే అంత్యక్రియలు జరిగాయి.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)