Breaking News

ఆ ‘పదం’ అంటే నాకు చాలా ఇష్టం: ట్రంప్‌

Published on Thu, 12/18/2025 - 11:32

తన గురించి తానే కాస్త అతిగా గొప్పలు చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పొగిడేసుకున్నారు. తనను తాను ప్రశంసించుకుంటూ 10 నెలల్లో 8 యుద్ధాలను ఆపేశానని.. ఇందుకు ప్రధాన కారణం టారిఫ్‌లేనంటూ వ్యాఖ్యానించారు. తాజాగా అమెరికా ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇంగ్లీష్ భాషలో తనకు అత్యంత ఇష్టమైన పదం ‘టారిఫ్స్’ అంటూ చెప్పుకొచ్చారు.

మరోవైపు మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌పై విమర్శలు గుప్పించారు. తనకు గందరగోళ పరిస్థితి వదిలి వెళ్లారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  తాను అమెరికా బలాన్ని తిరిగి నిలబెట్టానని.. 10 నెలల్లో 8 యుద్ధాలను పరిష్కరించానన్నారు. ఇరాన్ అణు ముప్పును తొలగించాను. గాజాలో యుద్ధాన్ని ముగించాను. దాదాపు 3,000 ఏళ్ల అనంతరం అక్కడ శాంతిని నెలకొల్పి.. బందీలను స్వదేశానికి తీసుకొచ్చానన్న ట్రంప్.. తన ప్రభుత్వ 2026 అజెండాను ప్రజలకు వివరించారు.

కాగా, అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేదించిన దేశాల జాబితాను ట్రంప్‌ యంత్రాంగం మరింత విస్తరించింది. మరో 20 దేశాలను తాజాగా అందులోకి చేర్చింది. అమెరికా జాతీయ భద్రత, ప్రజల భద్రత ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. సంబంధిత ఉత్తర్వులపై అధ్యక్షుడు మంగళవారం సంతకం చేశారు.

బుర్కినా ఫాసో, మాలీ, నైగర్, దక్షిణ సుడాన్, సిరియాపై పూర్తి ఆంక్షలు, అమెరికాలోకి ప్రవేశంపై నిషేధం విధించారు. మరో 15 దేశాలైన అంగోలా, ఆంటిగ్వా అండ్‌ బార్బుడా, బెనిన్, కోటె డి ఐవోయిర్, డొమినికా, గాబన్, ద గాంబియా, మలావీ, మార్షియానా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగా, జాంబియా, జింబాబ్వే  పాక్షిక నిషేధ పరిధిలోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
 

 

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)