Breaking News

తారా స్థాయికి చేరిన ‘Gen Z’ ఉద్యమం.. యుద్ధం తప‍్పదంటూ ట్రంప్‌ వార్నింగ్‌

Published on Fri, 01/02/2026 - 17:33

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారి ప్రాణాల్ని అన్యాయంగా తీసుకుంటుంటే అమెరికా చూస్తూ ఊరుకోదు. నిరసనకారులపై బలప్రయోగం చేయొద్దు. వారిని చంపితే ఇరాన్‌పై యుద్ధం చేస్తామంటూ ట్రూత్‌ సోషల్‌ వేదికగా పేర్కొన్నారు.  

ఇరాన్‌లో జెన్‌జీ (Gen Z) ఉద్యమం తారాస్థాయికి చేరింది. అక్కడి యువత ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, రియాల్ కరెన్సీ పతనం కారణంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ నిరసనలు గత వారం టెహ్రాన్‌లో ప్రారంభమై కొన్ని గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఈ క్రమంలో ఆందోళన కారుల్ని అరికట్టేందుకు కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు.  

ఈ క్రమంలో ఇరాన్‌ తీరుపై ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. ‘ఇరాన్ ప్రజలపై దాడులు కొనసాగితే, అమెరికా మౌనంగా ఉండదు. మేం సిద్ధంగా ఉన్నాం’ అని ట్రంప్ అన్నారు. అంతేకాదు నిరసన కారులను రక్షించేందుకు అమెరికా చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.

2022 తర్వాత తొలిసారి ఇరాన్‌ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతుండడం, రికార్డు స్థాయిలో కరెన్సీ విలువ పడిపోవడం, అనైతిక చట్టాల అమలుతో పాటు పలు అంశాలపై ఇరాన్‌లోని టెహ్రాన్‌తో పాటు పలు ప్రోవిన్స్ ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. నిరసన కారుల్ని అణిచి వేసేందుకు కాల్పులకు తెగబడుతోంది. ఫలితంగా ఐదురోజుల వ్యవధిలో సుమారు ఏడుగురికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)