Breaking News

జెఫ్రీ ఎప్‌స్టీన్‌ స్కామ్‌కు  ఫుల్‌స్టాప్‌ పెట్టాలి 

Published on Sat, 07/19/2025 - 06:40

వాషింగ్టన్‌:  రాజకీయ నాయకులకు వ్యభిచారిణులను ఎరగా వేసి, సొంత పనులు చక్కబెట్టుకోవడంలో సిద్ధహస్తుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్‌స్టీన్‌ వ్యవహారంలో పూర్తి నిజాలు బయటకు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక తాజాగా ఓ రిపోర్ట్‌ ప్రచురించింది. 2003లో జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు పంపించిన బర్త్‌డే లేఖలో ట్రంప్‌ పేరు, సంతకం ఉన్నట్లు ఆ పత్రిక బయటపెట్టింది.

 అభ్యంతకర రీతిలో ఉన్న ఓ మహిళ శరీర భాగాలు, దానిపై ట్రంప్‌ సంతకం ఇందులో కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ట్రంప్‌పై ప్రతిపక్ష డెమొక్రటిక్‌ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆయన అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. దీనిపై ట్రంప్‌ తాజాగా స్పందించారు. అది నకిలీ లేఖ అని తేల్చిచెప్పారు. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ను, పాత్రికేయుడు రూపర్డ్‌ మర్దోక్‌ను కోర్టుకు లాగుతానని హెచ్చరించారు.

 డెమొక్రటిక్‌ పార్టీ సృష్టిస్తున్న ఈ కుంభకోణానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఎప్‌స్టీన్‌ అంశంలో పూర్తి వివరాలు సేకరించాలని, నిజాలు నిగ్గుతేల్చాలని తమ అటార్నీ జనరల్‌ పామ్‌ బాండీని ఆదేశించారు. కోర్టు ఆమోదం మేరకు సమాచారం బహిర్గతం చేయాలన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ట్రంప్‌ ఆదేశాలపై దీనిపై పామ్‌ బాండీ ప్రతిస్పందించారు. కోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని, ఎప్‌స్టీన్‌పై ఇప్పటిదాకా రహస్యంగా సాగిన దర్యాప్తునకు సంబంధించిన వివరాలు సేకరించేందుకు ప్రయతి్నస్తానని స్పష్టంచేశారు.   
 

Videos

చంద్రబాబు గుర్తుపెట్టుకో.. చీర లాగి.. ఇంత దారుణంగా కొడతారా..? జనసేన నేత వార్నింగ్

ప్రసాద్ బాబుకు ఒక న్యాయం.. ఇందిరకు మరో న్యాయమా?

విడుదల రజిని ఘటనపై ధ్రువ్ రాఠీ స్పందన

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

Photos

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు