‘రాజకీయ కారణాలతోనే బైడెన్‌ వారిని వదిలేశారు’

Published on Wed, 02/19/2025 - 12:36

వాషింగ్టన్‌: వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌లు అంతరిక్షంలో చిక్కుకుపోవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌,ఆయన సన్నిహితుడు ఇలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కారణాల వల్లే సునీతా విలియమ్స్‌,విల్మోర్‌లను బైడెన్‌ అంతరిక్షంలో వదిలేశారని  చెప్పారు. మంగళవారం(ఫిబ్రవరి 18)ట్రంప్‌, మస్క్‌ సంయుక్తంగా ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

అధ్యక్షుడి ఆదేశాల మేరకు వ్యోమగాములిద్దరిని నాలుగు వారాల్లో భూమికి తీసుకువస్తామని మస్క్‌ తెలిపారు. గతంలో చాలా మంది వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకువచ్చిన చరిత్ర తన ‘స్పేస్‌ ఎక్స్’ కంపెనీకి ఉందన్నారు. ఇంతలో ట్రంప్‌ జోక్యం చేసుకుని వారిని త్వరగా తీసుకు రావాలని మస్క్‌ను కోరారు. 

గతంలో బైడెన్‌ వ్యోమగాములను తీసుకువచ్చేందుకు ‘స్పేస్‌ ఎక్స్‌’కు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదని ట్రంప్‌ చెప్పారు. గతేడాది జూన్‌లో అంతర్జాతీయ అంతరిక్షకేంద్రానికి(ఐఎస్‌ఎస్‌) 10 రోజుల కోసం వెళ్లిన సునీత,విల్మోర్‌లు బోయింగ్‌ వ్యోమనౌకలో సమస్యల వల్ల ఇప్పటికీ భూమికి తిరిగి రాలేదు. వీరిని మార్చి మొదటి వారంలో మస్క్‌కు చెందిన స్పేస్‌ క్స్‌ క్రూ డ్రాగన్‌ భూమికి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)