Breaking News

అమెరికా ఏఐ సలహాదారుగా శ్రీరామ్‌ కృష్ణన్‌

Published on Tue, 12/24/2024 - 05:19

వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన అమెరికన్‌ పారిశ్రామికవేత్త, మస్క్‌ సహాయకుడు శ్రీరామ్‌ కృష్ణన్‌ వైట్‌హౌస్‌ బృందంలో చేరారు. మైక్రోసాఫ్ట్‌ మాజీ ఉద్యోగి అయిన శ్రీరామ్‌ కృష్ణన్‌ను ఆఫీస్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీలో కృత్రిమ మేధ విధానాలపై సీనియర్‌ సలహాదారుగా నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌ ఆదివారం ప్రకటించారు. 

కృత్రిమ మేధ విధానాన్ని రూపొందించడంలో, సమన్వయం చేయడంలో శ్రీరామ్‌ కృష్ణన్‌ సహాయపడతారని, డేవిడ్‌ సాక్స్‌తో కలిసి పనిచేస్తారని ట్రంప్‌ తన సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌ సోషల్‌లో ప్రకటించారు. ట్రంప్‌ ప్రకటనపై కృష్ణన్‌ స్పందించారు. ‘మన దేశానికి సేవ చేయడం, కృత్రిమ మేధలో అమెరికా నాయకత్వాన్ని కొనసాగించడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అవకాశం ఇచి్చనందుకు డోనాల్డ్‌ ట్రంప్‌కు దన్యవాదాలు’అని ట్వీట్‌ చేశారు.   

తమిళనాడు నుంచి... 
శ్రీరామ్‌ కృష్ణన్‌ తమిళనాడులోని ఎస్‌ఆర్‌ఎం వల్లియమ్మై ఇంజనీరింగ్‌ కళాశాలలో చదివారు. మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్, ట్విట్టర్‌లలో పనిచేశారు. ఇటీవలే ఆండ్రీసెన్‌ హోరోవిట్జ్‌ (ఎ 16 జెడ్‌)లో సాధారణ భాగస్వామిగా చేరారు. ఫేస్‌బుక్‌లో మొబైల్‌ యాప్‌ అడ్వర్టైజింగ్‌ వేదికను విస్తరించడంలో కీలకంగా వ్యవహరించారు. ఎలన్‌మస్క్‌ ట్విట్టర్‌ను (ఇప్పుడు ఎక్స్‌)ను స్వాధీనం చేసుకున్నప్పుడు కీలకంగా పనిచేసిన కృష్ణన్‌ ఆయనతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారు. ఆ తరువాత ఆండ్రీసెన్‌ హోరోవిట్జ్‌ (ఎ 16జెడ్‌)లో సాధారణ భాగస్వామి అయ్యారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)