Breaking News

భారత్‌పై విషం చిమ్మిన ట్రంప్‌ సలహాదారు.. మోదీ, పుతిన్‌, జిన్‌పింగ్‌ దోస్తీ టార్గెట్‌

Published on Mon, 09/01/2025 - 10:04

వాషింగ్టన్‌: రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ సలహాదారు పీటర్  విషం చిమ్మారు. రష్యా , చైనాలతో ప్రధాని నరేంద్ర మోదీకి పెరుగుతున్న సాన్నిహిత్యంపై నవారో పలు ప్రశ్నలు సంధించారు.  

ట్రంప్ సలహాదారు పీటర్ నవారో తరచూ భారత్‌పై ఆరోపణలు చేస్తున్నారు. భారతదేశంలోని కొన్ని వర్గాలు ఈ రష్యన్ చమురు నుండి లాభార్జన చేస్తున్నాయని, ఫలితంగా సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని తాజాగా నవారో ఆరోపించారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నవారో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా, చైనాలతో పెరుగుతున్న సాన్నిహిత్యంపై ప్రశ్నించారు. ‘మోదీ గొప్ప నాయకుడు. ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నేత.. అలాంటప్పుడు పుతిన్, షీ జిన్‌పింగ్‌ సరసన ఎందుకు నిలబడుతున్నారో అర్థం కావడంలేదు. ఈ విషయంలో ఏమి జరుగుతున్నదో భారత ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కొంతమంది బ్రాహ్మణులు తమ సొంత ప్రయోజనాల కోసం సామాన్యులకు హాని చేస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగిపోవాలి’ అని వ్యాఖ్యానించారు.
 

ఇదేవిధంగా గత ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి ముందు.. రష్యా నుండి భారతదేశ చమురు కొనుగోళ్లు చాలా తక్కువగా ఉన్నాయని, అయితే ఆ తర్వాత భారత్‌ చమురు దిగుమతులను అనేక రెట్లు పెంచిందని నవారో  ఆరోపించారు. భారత్‌.. రష్యన్ ముడి చమురును కొనుగోలు చేసి, దానిని శుద్ధి చేసి, ఆఫ్రికా, యూరప్, ఆసియాలోని పలు దేశాలకు అధిక ధరలకు విక్రయిస్తున్నదని, ఇది రష్యా ‘యుద్ధ యంత్రాంగానికి’ బలాన్నిస్తుందని ఆరోపించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)