Breaking News

ట్రంప్‌ ఆదేశాలు.. వారికి ‘హార్వర్డ్‌’లో నో అడ్మిషన్

Published on Fri, 05/23/2025 - 07:38

వాషింగ్టన్‌ డీసీ: ట్రంప్ పరిపాలనా విభాగం విదేశీ విద్యార్థులకు పిడుగుపాటు లాంటి వార్త వినిపించింది. ఇకపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం(Harvard University)లో విదేశీ విద్యార్థులను చేర్చుకోకుండా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం విశ్వవిద్యాలయంపై కొనసాగించిన దర్యాప్తు దరిమిలా ట్రంప్‌ పరిపాలనా విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ విశ్వవిద్యాలయానికి ఒక లేఖ పంపారు.

క్రిస్టి నోయెమ్ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ఎక్స్‌లో ఈ వివరాలను తెలియజేస్తూ వర్శిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోగలగడం అనేది హక్కు కాదని, అది ప్రత్యేక  అవకాశం అని పేర్కొన్నారు. రాబోయే విద్యా సంవత్సరానికి ముందే హార్వర్డ్ స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్‌ను తిరిగి పొందే అవకాశాన్ని వర్శిటీ కోరుకుంటే 72 గంటల్లోపు అందుకు అవసరమైన సమాచారాన్ని అందించాలని ఆమె పేర్కొన్నారు. ట్రంప్ పరిపాలన విభాగం తీసుకున్న  నిర్ణయం కారణంగా ప్రస్తుత విద్యార్థులను ఇతర విద్యాసంస్థలకు బదిలీ చేయవలసి వస్తుందని, లేదా వారి చట్టపరమైన హోదాను కోల్పోయేలా చేస్తుందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం(Department of Homeland Security తెలిపింది.

దీనిపై స్పందించిన విశ్వవిద్యాలయం ఇది ట్రంప్‌ ప్రతీకార చర్య అని, ఈ నిర్ణయం విశ్వవిద్యాలయానికి హాని కలిగిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ చర్య చట్టవిరుద్ధమని, 140కిపైగా దేశాల నుండి వచ్చిన అంతర్జాతీయ విద్యార్థులు,  అధ్యాపకులకు ఆతిథ్యం ఇచ్చే హార్వర్డ్ సామర్థ్యాన్ని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. కాగా గత ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్వర్డ్‌ను ఒక జోక్‌గా అభివర్ణించారు. హార్వర్డ్‌ను ఇకపై మంచి అభ్యాస ప్రదేశంగా కూడా పరిగణించలేమని, దానిని ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల జాబితాలో ఒకటిగా పరిగణించకూడదని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో వ్యాఖ్యానించారు. విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం 2024-2025 విద్యా సంవత్సరంలో హార్వర్డ్ దాదాపు 6,800 మంది అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకుంది. ఇది అక్కడి మొత్తం విద్యార్థులలో27 శాతం. ప్రస్తుతం భారతదేశానికి చెందిన 788 మంది విద్యార్థులు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్నారు. 



ఇది కూడా చదవండి: జ్యోతి పోలీస్‌ కస్టడీ నాలుగు రోజులు పొడిగింపు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)