Breaking News

‘హార్వర్డ్‌’కు ట్రంప్‌ మరో షాక్‌.. యూదు హక్కులపై వేటు

Published on Tue, 07/01/2025 - 08:17

వాషింగ్టన్: అమెరికాలోని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంపై ట్రంప్‌ పరిపాలనా విభాగం మరోమారు దృష్టి సారించింది. హార్వర్డ్‌తో పాటు వర్శిటీలోని ఇజ్రాయెల్ విద్యార్థులు పౌర హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించింది. దీనిపై హార్వర్డ్‌ అత్యవసర చర్యలు చేపట్టకపోతే సమాఖ్య నిధులను నిలిపివేస్తామని హెచ్చరించింది.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..  వర్శిటీ పాఠ్యాంశాలు, సిబ్బంది నియామకం, విద్యార్థుల  అడ్మిషన్‌ తదితర విషయాల్లో చేసిన ఆదేశాలను ధిక్కరించిన నేపధ్యంలో ‘హార్వర్డ్’పై ట్రంప్‌ పాలకవర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది.  హార్వర్డ్ అధ్యక్షునికి ట్రంప్‌ యంత్రాంగం పంపిన ఒక లేఖలో.. గాజాలో హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధానికి వ్యతిరేకంగా క్యాంపస్‌లో జరిగిన నిరసనల్లో విద్యార్థులను రక్షించడంలో వర్శిటీ విఫలమైందని ఆరోపించింది. దీనిపై దర్యాప్తు తర్వాత కూడా హార్వర్డ్ ఉద్దేశపూర్వకంగా ఉదాసీనంగా వ్యవహరించిందని పేర్కొంది.

అమెరికా ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ విలేకరులతో మాట్లాడుతూ ‘హార్వర్డ్’ పౌర హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, ఇదేకొనసాగితే సమాఖ్య నిధులు అందవని హెచ్చరించారు. కాగా ట్రంప్‌ పరిపాలనా విభాగం మసాచుసెట్స్‌లోని విశ్వవిద్యాలయంలో చేరాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు వీసాలు నిరాకరించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న  అమెరికా రాయబార కార్యాలయాలకు సూచించింది. అయితే హార్వర్డ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీతో పాటు ఇతర ఏజెన్సీలు దీనిని వ్యతిరేకించాయ. ఇటువంటి చర్యలు చట్టవిరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని వాదించాయి. దీంతో కోర్టులు ప్రస్తుతానికి  ట్రంప్‌ యంత్రాంగం చేపట్టాలకుకున్న చర్యలకు అడ్డుకట్టవేశాయి. 2024-2025 విద్యా సంవత్సరంలో హార్వర్డ్‌లోని మొత్తం విద్యార్థులలో 27 శాతం మంది  విదేశీ విద్యార్థులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: వ్యూహాత్మక మిత్రదేశంగా భారత్‌: ప్రధాని మోదీకి వైట్‌హౌస్‌ అభినందనలు
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి