మిలిటెంట్ గ్రూప్‌ మిలియన్ మార్చ్.. అట్టుడుకుతున్న పాకిస్తాన్

Published on Sat, 10/11/2025 - 16:52

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ను బలోచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ, ఐఎస్‌ఐఎస్‌-ఖోరాసన్‌, తెహ్రీక్‌-ఏ-తాలిబన్‌ పాకిస్థాన్‌ వంటి ఉగ్ర సంస్థలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో.. తాజాగా  మరో మిలిటెంట్‌ గ్రూపు తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్థాన్ (TLP) చేపట్టిన ‘లబ్బైక్ యా అక్సా మిలియన్ మార్చ్’ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

పాలస్తీనాకు మద్దతుగా, ఇజ్రాయెల్ వ్యతిరేకంగా రావల్పిండిలో టీఎల్‌పీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ ఆందోళన కారణంగా పాకిస్తాన్‌లోని పలు ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ స్తంభించింది. రవాణా రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్థంభించిపోయింది. 

ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు సున్నిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. టీఎల్‌పీ నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ప్రతి చర్యగా టీఎల్‌పీ కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసు వాహనాల్ని ధ్వంసం చేశారు. వారిని అదుపులోకి తెచ్చేందుకు భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. 65 మంది TLP కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వారిపై శాంతి భంగం, ప్రభుత్వ ఆస్తుల నష్టం, ప్రజల రవాణాకు అడ్డంకులు కలిగించడం వంటి అభియోగాలు నమోదు చేశారు.

ఈ ఘటనపై పాక్‌ పంజాబ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దేశంలో శాంతి భద్రతలను కాపాడటం తమ ప్రాధాన్యత అని అధికార ప్రతినిధులు పేర్కొన్నారు. మరోవైపు, TLP నాయకులు తమ కార్యకర్తలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
 

 

 

 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)