Breaking News

ట్రంప్‌ చర్యలపై నిరసనలు 

Published on Tue, 02/04/2025 - 05:02

వాషింగ్టన్‌: అక్రమ వలసదారులను తిప్పి పంపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేపడుతున్న చర్యలను వేలాది మంది వ్యతిరేకించారు. అక్రమ వలసదారులను నిర్బంధించి మూకుమ్మడిగా సామూహిక బహిష్కరణలు చేపడతానన్న ట్రంప్‌ నిర్ణయాన్ని నిరసిస్తూ వేలాది మంది ప్రజలు ఆదివారం దక్షిణ కాలిఫోర్నియాలో ర్యాలీ చేపట్టారు. లాస్‌ ఏంజెలెస్‌లోని డౌన్‌టౌన్‌తో సహా నిరసనకారులు ప్రధాన జాతీయ రహదారిని కొన్ని గంటల పాటు దిగ్బంధించారు.

 ఇమ్మిగ్రేషన్‌ సంస్కరణలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ‘ఎవ్వరూ చట్టవిరుద్ధం కాదు’, ‘ఇమ్మిగ్రెంట్స్‌ అమెరికాను గొప్పగా మార్చారు’వంటి నినాదాలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. మధ్యాహ్నానికల్లా యూఎస్‌ 101లోని అన్ని మార్గాలను దిగ్బంధించడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. కాలిఫోర్నియా హైవే పెట్రోలింగ్‌ అధికారుల బందోబస్తు నిలవగా నిరసనకారులు వీధుల్లో బైఠాయించారు. ఫ్రీవే పూర్తిగా తెరవడానికి ఐదు గంటలకు పైగా సమయం పట్టింది. 

తూర్పున రివర్‌సైడ్‌ నగరంలో వందలాది మంది నిరసన తెలిపారు. ఓ కూడలి వద్ద జెండాలు ఎగురవేస్తున్న నిరసనకారులకు మద్దతుగా వాహనదారులు ఆపకుండా అంతా ఒకేసారి హారన్‌ మోగించి తమ మద్దతు తెలిపారు. శాన్‌డియాగో నగరంలోని కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద వందలాది మంది ఆదివారం ర్యాలీ నిర్వహించారు. అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అరెస్టులకు నిరసనగా డల్లాస్‌లో నిరసనకారులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఐసీఈ దాడులను నిరసిస్తూ ఆర్లింగ్టన్‌ నగరంలో వందలాది మంది ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిటీ హాల్‌ వెలుపల జెండాలతో నిరసన తెలిపారు. ట్రంప్‌ ఇమ్మిగ్రేషన్‌ విధానాలకు వ్యతిరేకంగా టారెంట్‌ కౌంటీలో నిరసనకారులు ఆందోళనకు దిగారు.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)