Breaking News

మూడో ప్రపంచ యుద్ధం వస్తే.. ఈ దేశాలు సేఫ్‌!

Published on Tue, 06/24/2025 - 12:27

న్యూఢిల్లీ: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఘర్షణలు మూడవ ప్రపంచయుద్ధానికి దారితీసేలా ఉన్నాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఇరు దేశాల మధ్య నెలకొన్న  అస్థిర వాతావరణం.. ఒకవేళ ప్రపంచ యుద్ధానికి దారితీస్తే, మిత్రదేశాలన్నీ  ఈ యుద్ధంలో పాల్గొనే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మూడవ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రజలకు ఆశ్రయం కల్పించేలా కొన్ని దేశాలున్నాయి.  ఆయా దేశాల్లోని భౌగోళిక, రాజకీయ స్థితిగతులు, సైనిక తటస్థత , స్థిరమైన పరిస్థితుల కారణంగా సురక్షితమైన ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. ‘ది మెట్రో’ తెలిపిన వివరాల ప్రకారం ఆ దేశాలు ఇవే..

అంటార్కిటికా
అణు యుద్ధం జరిగిన పక్షంలో అంటార్కిటికా అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. అణు శక్తులకు ఈ ప్రాంతం చాలా దూరంలో ఉంది.  దేశంలోని 14 మిలియన్ చదరపు కిలోమీటర్ల ప్రాంతం నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు సిద్ధంగా  ఉంది. అయితే ఇక్కడి మంచుతో కూడిన వాతావరణం మనుగడకు సవాలుగా  నిలుస్తుంది.

ఐస్లాండ్
అత్యంత శాంతియుత దేశాలలో ఒకటిగా, స్థిరమైన ర్యాంక్‌తో ఐస్లాండ్ గుర్తింపు పొందింది. ఐస్లాండ్ పూర్తి స్థాయి యుద్ధంలో ఎప్పుడూ పాల్గొనలేదు.  దేశ భౌగోళిక స్థానం యుద్ధాలకు తక్కువ అవకాశమిస్తుంది.  అయితే అణుయుద్ధం నుంచి రక్షణ కల్పించడంలో అంత అనువైన దేశం కాదు.

న్యూజిలాండ్
తటస్థ వైఖరితో గ్లోబల్ పీస్ ఇండెక్స్‌లో రెండవ స్థానంలో ఉన్న న్యూజిలాండ్.. ఇక్కడ పర్వత భూభాగాల కారణంగా రక్షణను అందిస్తుంది. ఈ దేశం ఉక్రెయిన్‌కు ఆర్థికంగా మద్దతు  ఇచ్చింది.

స్విట్జర్లాండ్
రెండవ ప్రపంచ యుద్ధంలో స్విట్జర్లాండ్ తటస్థతంగా వ్యవహరించింది. ఇక్కడి పర్వత ప్రాంతాలు  యుద్ధాల నుంచి రక్షణ కల్పిస్తాయని నిపుణులు చెబుతుంటారు.  దేశ రాజకీయ తటస్థ వైఖరి కారణంగా దాడులకు అవకాశం తక్కువ.

గ్రీన్లాండ్
ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపంగా గ్రీన్లాండ్ పేరొందింది. దేశ రాజకీయ తటస్థత.. యుద్ధ భయాలను దూరం చేసేదిగా ఉంది. 56 వేల మంది జనాభా మాత్రమే కలిగిన ఈ దేశంలో సంఘర్షణలకు ఆస్కారం చాలా తక్కువని చెబుతుంటారు.

ఇండోనేషియా
ఇండోనేషియా నిరంతరం ప్రపంచ శాంతికి ప్రాధాన్యతనిస్తూ, తటస్థ విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుంది. దేశ స్వతంత్ర వైఖరి, భౌగోళిక రాజకీయ స్థానం మొదలైనవి ఈ దేశాన్ని ప్రపంచ సంఘర్షణలవైపు చూసేలా చేయనివ్వవు.

తువాలు
కేవలం 11 వేల మంది జనాభా కలిగిన చిన్న ద్వీప దేశమిది.ఇక్కడి పరిమిత మౌలిక సదుపాయాలు, వనరులు యుద్ధ పరిస్థితులకు తావులేనివిధంగా ఉన్నాయి. హవాయి, ఆస్ట్రేలియా మధ్య ఉన్న ఈ దేశం అత్యంత సురక్షిత ప్రాంతంగా గుర్తింపు పొందింది.

అర్జెంటీనా
అర్జెంటీనాకు సంఘర్షణల చరిత్ర ఉన్నప్పటికీ, ఇక్కడి వ్యవసాయ వనరుల కారణంగా ఇది సాపేక్షంగా సురక్షితమైన దేశంగా పేరొందింది.

భూటాన్
1971లో తటస్థతను ప్రకటించినప్పటి నుండి భూటాన్ సురక్షితంగా ఉంటోంది.  దేశంలోని పర్వత భూభాగం యుద్దాల నుంచి రక్షణను అందిస్తుంది. దేశ భౌగోళిక స్వరూపం బాహ్య ముప్పుల సులభంగా తప్పించుకునే విధంగా ఉంది.

చిలీ
నాలుగు వేల మైళ్ల విస్తీర్ణంలో ఉన్న చిలీ.. విస్తారమైన తీరప్రాంతాన్ని, సమృద్ధిగా ఉన్న సహజ వనరులను కలిగివుంది. ఇది ప్రజలకు భద్రతను,  స్థిరత్వాన్ని అందిస్తుంది. దక్షిణ అమెరికాలోని అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాలలో చిలీ ఒకటిగా నిలిచింది.

ఫిజీ
ఆస్ట్రేలియాకు 2,700 మైళ్ల దూరంలో ఫిజీ ఉంది. దట్టమైన అడవులు  ఈ దేశాన్ని శాంతియుత ప్రాంతంగా మార్చాయి. గ్లోబల్ పీస్ ఇండెక్స్‌లో ఫిజీ తన ర్యాంక్‌ను కాపాడుకుంటూ వస్తోంది.

దక్షిణాఫ్రికా
దేశంలోని సారవంతమైన భూమి, ఆధునిక మౌలిక సదుపాయాలు ‍ప్రజల మనుగడకు  తగిన అవకాశాలను అందిస్తున్నాయి. దేశంలోని వైవిధ్యమైన వనరులు, వ్యవసాయ సామర్థ్యం.. సంక్షోభాల సమయంలో దేశాన్ని సురక్షితంగా ఉంచుతున్నాయి. 

ఇది కూడా చదవండి: 24 మంది విద్యార్థినులతో ‘అనుచితం’.. ఉపాధ్యాయుడు అరెస్ట్‌

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)