Breaking News

USA: మీ పాలన వద్దు బాబోయ్.. ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు?

Published on Sat, 01/31/2026 - 01:17

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆ దేశంలో నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఇంతకాలం ఆయన ఇమ్మిగ్రేషన్ పాలసీనే వ్యతిరేకించిన అమెరికన్లు ఇప్పుడు ట్రంప్ పాలనపైనే వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలోనే ట్రంప్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఆయన పాలనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా  నిరసనలకు పిలుపునిస్తున్నట్లు సమాచారం.

"నేనేప్పుడు ఏం చేస్తానో నాకే తెలియదు" ఇది ఒక సినిమాలోని ఫేమస్ డైలాగ్ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారంలో సరిగ్గా సరిపోతుంది. ఆయన ఎప్పుడు ఏంమాట్లాడుతారో.. ఏదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో.. ఏభూమిని స్వాధీనం చేసుకుంటారో.. ఏ దేశంపై పన్నులు పెంచుతారో ఆయనకే తెలియదు.. అందుకే ట్రంప్‌ పాలన విధానంపై  ప్రపంచ దేశాలు భయంభయంగా ఉంటాయి. అయితే ఇప్పుడు  సీన్ మరింతగా ముదిరింది. ఆయన పాలనపై తాజాగా అమెరికాలోనూ తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల అమెరికా మిన్నోసోటా రాష్ట్రంలో ఇమ్మిగ్రేషన్ అధికారుల దాడుల్లో ఇద్దరు మరణించగా అందుకు వ్యతిరేకంగా అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. చాలామంది తమ వ్యాపారాలను మూసి వేసి రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. విద్యార్థులు సైతం పాఠశాలల నుంచి క్లాసులు వాకౌట్ చేశారు. అంతేకాకుండా నోవర్క్, నోస్కూల్, నోషాపింగ్ పేరుతో అమెరికా అంతటా ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు.

దీంతో ట్రంప్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతుందని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకాలం ఆయన ఇమ్మిగ్రేషన్ విధానాన్నే వ్యతరేకించిన అమెరికన్స్ తాజాగా ఆయన పరిపాలన పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలోనూ ట్రంప్ పాలనను అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడైంది. మెుత్తానికి మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్‌ని చివరకు ఆ దేశ ప్రజల చేతే  తిరస్కరణకు గురవుతున్నట్లు తెలుస్తోంది.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)