Breaking News

Israel Hamas War: కాల్పుల విరమణపై బైడెన్‌ కీలక వ్యాఖ్యలు

Published on Wed, 03/06/2024 - 08:33

వాషింగ్టన్‌: హమాస్‌- ఇజ్రాయెల్‌ యుద్ధంలో తక్షణ తాత్కాలిక కాల్పుల విరమణ హమాస్‌ గ్రూపు చేతిలోనే ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. వచ్చే వారం ప్రారంభం కానున్న పవిత్ర రంజాన్‌ మాసంలో 40 రోజుల పాటు కాల్పుల విరమణ కోసం ఖతార్‌, ఈజిప్టులకు చెందిన దూతలు ఈజిప్టు రాజధాని కైరోలో హమాస్‌ గ్రూపు ప్రతినిధులతో జరుపుతున్న చర్చల్లో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేని నేపథ్యంలో బైడెన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కాల్పుల విరమణ డీల్‌లో భాగంగా  ఇటు హమాస్‌ తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్‌ బంధీలను విడుదల చేయాల్సి ఉంటుంది. మరోవైపు గాజాకు మానవతాసాయాన్ని భారీగా పెంచేందుకు అనుకూల వాతావరణాన్ని ఇజ్రాయెల్‌ కల్పించడం అనేవి ప్రధాన షరతులుగా ఉన్నాయి. అయితే కాల్పుల విరమణ ఒప్పందానికి  ఓకే చెప్పి తమ వద్ద ఉన్న బంధీలను విడుదల చేయాలంటే హమాస్‌ భారీ డిమాండ్లు ముందు పెడుతోంది.

ఇజ్రాయెల్‌ తమపై దాడులు పూర్తిగా ఆపాలి, ఇజ్రాయెల్‌ సేనలు గాజా నుంచి వెళ్లిపోవాలి, ఇళ్లు వదిలి పోయిన గాజా వాసులు తిరిగి ఇళ్లకు వచ్చే పరిస్థితులు కల్పించాలి లాంటి డిమాండ్లు పరిష్కరించి యుద్ధానికి పూర్తిగా ఫుల్‌స్టాప్‌ పెట్టాలని హమాస్‌ కోరుతోంది. అయితే వీటన్నింటికి ముందు కాల్పుల విరమణ అనేది తప్పనిసరని పేర్కొంటోంది.

దీనికి ఇజ్రాయెల్‌ స్పందిస్తూ తాము కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ పాటించి గాజా వాసులకు మరింత మానవతాసాయం అందించేందుకు మాత్రమే ఒప్పుకుంటామని, హమాస్‌ అంతమయ్యేదాకా యుద్ధం ఆపేది లేదని తేల్చి చెబుతోంది. మరోవైపు ఐక్యరాజ్యసమితి(యూఎన్‌) సెక్యూరిటీ కౌన్సిల్‌లో ఇజ్రాయెల్‌, హమాస్‌లు తక్షణం కాల్పుల విరమించాలని అమెరికా తీర్మానం ప్రవేశపెట్టింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా కాల్పుల విరమణ తీర్మానం ప్రవేశపెట్టడం ఇది తొలిసారి కావడం విశేషం.

ఇదీ చదవండి.. అమెరికా అధ్యక్ష పోరులో మళ్లీ ఆ ఇద్దరే..!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)