Breaking News

భారత్‌, చైనాల మధ్య నలిగిపోము: శ్రీలంక అధ్యక్షుడు

Published on Tue, 09/24/2024 - 10:56

కొలంబో: భారత్‌, చైనా దేశాలతో విదేశాంగ విధానంలో శ్రీలంక సమానమైన వైఖరిని పాటిస్తుందని ఆ దేశ కొత్త అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే అన్నారు.  అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి భారత్‌, చైనా విదేశాంగ విధానంపై స్పందించారు. భారత్‌, చైనాల మధ్య  నలిగిపోయే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ఆయన ఓ ఇంటర్వ్యులో  పొరుగుదేశాలతో విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘మా నాయకత్వంలో దేశం భౌగోళిక, రాజకీయ ప్రత్యర్థుల జోలికి వెళ్లకుండా చూస్తాం. నేషనల్ పీపుల్స్ పవర్( ఎన్‌పీపీ) ప్రభుత్వం ఏ దేశంతోను జతకట్టదని, పొరుగు దేశాలైన భారత్‌, చైనా రెండు దేశాలతో సమతుల్య సంబంధాలను పెంపొందించుకోవాలని భావిస్తోంది.మేము భౌగోళిక, రాజకీయ పోరాటంలో ఎవరితో పోటీదారులం కాదు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోము. ముఖ్యంగా  భారత్‌, చైనాల మధ్య నలిగిపోవాలనే ఉద్దేశం మాకు లేదు. రెండు దేశాలు విలువైన స్నేహితులుగా మా ప్రభుత్వ సన్నిహిత భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాం. యూరోపియన్‌ యూనియన్‌, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాతో కూడా సంబంధాలను కొనసాగించుతాం” అని అన్నారు.

పొరుగు దేశాల ఆధిపత్య పోరులో శ్రీలంక నలిగిపోవద్దని ఇరుదేశాలతో పరస్పర ప్రయోజనకరమైన దౌత్య భాగస్వామ్యం నిర్మించడంపై దృష్టి సారిస్తోందని అన్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న  నేపథ్యంలో శ్రీలంక తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తటస్థ విదేశాంగ విధాన విధానమే కీలకమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

చదవండి: సంక్షోభ లంకపై నెలవంక!

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)