నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
శ్రీలంకలో తీవ్ర తుఫాను
Published on Sat, 11/29/2025 - 06:13
కొలంబో: శ్రీలంకను శుక్రవారం దిత్వాహ్ తుఫాను అతలాకుతలం చేసింది. వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మతాలె, పొలన్నరువా, యువ ప్రావిన్స్‌లను కలిపే వంతెనలు కొట్టుకుపోవడంతో ఆయా ప్రాంతాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కేబుళ్లు తెగిపోవడంతో రెండు పవర్ ప్లాంట్లను మూసివేశారు. విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతింది. రాజధాని కొలంబోతోపాటు అత్యధిక జనాభా కలిగిన గంపాహా జిల్లా తీవ్రంగా దెబ్బతిన్నాయి. కెలనీ, అట్టనగలు నదులు పొంగిపొర్లాయి.
మొత్తం 80 మంది చనిపోగా 34 మంది జాడ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. సుమారు 14 వేల మందిని 195 అత్యవసర కేంద్రాలకు తరలించామన్నారు. ‘ఆపరేషన్ సాగర్ బంధు’భారత ప్రభుత్వం శ్రీలంకకు ఐఎన్‌ఎస్ విక్రాంత్, ఐఎన్‌ఎస్ ఉదయగిరి ద్వారా మొదటి విడత తుఫాను సాయంగా ఆహార పదార్థాలను పంపించింది. ఇలా ఉండగా, తుఫాను ప్రభావం గత పది రోజుల వ్యవధిలోనే 100 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. గత 24 గంటల వ్యవధిలో కొండప్రాంతాల్లో 50 సెంటీమీటర్ల వాన కురిసిందని వివరించింది.
Tags : 1