Breaking News

సౌత్‌ కరోలీనా లిటిల్‌ రివర్‌లో కాల్పులు

Published on Mon, 05/26/2025 - 10:27

కొలంబియా: అమెరికా రాష్ట్రం సౌత్‌కరోలీనా(South Carolina) తుపాకీ మోతలతో దద్దరిల్లింది. స్థానిక కాలమానం ప్రకారం.. లిటిల్‌ రివర్‌ నగరంలో ఆదివారం రాత్రి జరిగిన కాల్పుల్లో 11 మంది గాయపడ్డారు. అయితే క్షతగాత్రుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

మైర్టెల్‌ తీరానికి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది లిటిల్‌ రివర్‌(Little River) నగరం. ఆదివారం రాత్రి మెమోరియల్‌ డే సందర్భంగా పలువురు గుమిగూడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో పలువురు గాయపడినట్లు, ప్రైవేట్‌ వాహనాల్లో ఆస్పత్రులకు చేరినట్లు హోరీ కౌంటీ పోలీసులు(Horry County Police) వెల్లడించారు. క్షతగాత్రుల పరిస్థితిపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

మరోవైపు కాల్పులకు పాల్పడింది ఎవరు? అనుమానితుడికి సంబంధించిన వివరాలను సైతం పోలీసులు ఇంకా వెల్లడించలేదు. అయితే.. ఘటనా స్థలానికి పోలీసు వాహనాలు, ఆంబులెన్స్‌లు వెళ్లిన దృశ్యాలు మాత్రం మీడియాలో కనిపిస్తున్నాయి. 

ఇదీ చదవండి: పుతిన్‌కు పిచ్చి.. నోరు జాగ్రత్త జెలెన్‌స్కీ!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)