Breaking News

106 కోట్లు పలికిన బంగారు టాయిలెట్‌ 

Published on Thu, 11/20/2025 - 04:45

న్యూయార్క్‌: కొందరు టాయిలెట్‌కు వెళితే ముక్కు మూసుకుని వెళ్తారు. కానీ ఈ టాయిలెట్‌ వార్త తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. 18 కేరట్ల స్వచ్ఛత ఉన్న బంగారంతో తయారుచేసిన ఈ టాయిలెట్‌ను బుధవారం అమెరికాలో ప్ర ఖ్యాత సోత్‌బే వేలంపాట సంస్థ వేలంవేయగా ఏకంగా 106 కోట్ల రూపాయల ధర పలికింది. ఈ టాయిలెట్‌ బరువు 101 కేజీలు. ఇది సాధారణ టాయిలెట్‌ కమోడ్‌ మాదిరే ఫ్లష్‌తోసహా పూర్తిస్థాయిలో పనిచేస్తుంది.

2016లో తొలిసారిగా అమెరికాలో దీనిని న్యూయార్క్‌ గుగెన్‌హామ్‌ మ్యూజియంలోని పబ్లిక్‌ బాత్రూమ్‌లో అమర్చారు. దీనిని చూసేందుకు లక్షలాది మంది జనం ఎగబడ్డారు. గతంలో ఒక అరటిపండుకు టేప్‌ను అతికించి ఇది కూడా కళాఖండమే అని ప్రకటించి కోట్ల రూపాయలకు అమ్ముడుపోయేలా చేసిన ఇటాలియన్‌ వ్యంగ్య కళాకారుడు మారీజియో క్యాటెలాన్‌ ఈ టాయిలెట్‌ను రూపొందించారు.

 ఈ టాయిలెట్‌కు వినూత్నంగా ‘అమెరికా’ అని పేరు పెట్టారు. అమెరికాలో అపార సంపద దాగుందని వెటకారంగా దీనికి ఈ పేరు పెట్టానని మారీజియో గతంలో వ్యాఖ్యానించారు. 2019లో అచ్చం ఇలాంటి మరో బంగారు టాయిలెట్‌ను తయారు చేశారు. బ్రిటన్‌లో విన్‌స్టన్‌ చర్చిల్‌ జన్మించిన బ్లెన్‌హామ్‌ ప్యాలెస్‌లో ఉంచగా దొంగలు దీనిని సుత్తితో పగలగొట్టి ముక్కలుగా ఎత్తుకుపోయారు. 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు