Breaking News

వేలానికి మరో బంగారు టాయిలెట్‌

Published on Sat, 11/01/2025 - 06:19

న్యూయార్క్‌: ప్రముఖ ఆర్టిస్ట్‌ మౌరిజియో క్యాటల్లాన్‌ రూపొందించిన కొత్త బంగారు టాయిలెట్‌ త్వరలో వేలానికి రానుంది. ఆయన గతంలో రూపొందించిన బంగారు టాయిలెట్‌ను దుండగులు అపహరించుకుపోయారు. అలాంటిదే మరో బంగారు టాయిలెట్‌ను క్యాటల్లాన్‌ రూపొందించటంతో దానిని ఈ నెల 18న ప్రముఖ వేలం సంస్థ సౌత్‌బే వేలం వేయనుంది. 

క్యాటల్లాన్‌ మొదట రూపొందించిన బంగారు టాయిలెట్‌ దాదాపు 100 కిలోల 18 క్యారెట్ల బంగారంతో తయారైంది. దాని పేరు అమెరికా. అది గొప్ప ఆర్ట్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. దానిని మొదట 2016లో న్యూయార్క్‌లోని గుగ్గెన్‌హీమ్‌ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచినప్పుడు దాదాపు లక్ష మంది సందర్శించారు. 

దానిని కొనుగోలు చేసేందుకు నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఆసక్తి చూపించారు. అయితే, దానిని బ్రిటన్‌లోని బ్లెన్‌హీమ్‌ ప్యాలెస్‌లో ప్రదర్శనకు ఉంచగా, 2019లో దొంగలు నాలుగు నిమిషాల్లోనే దోచుకెళ్లారు. ఎంత గాలించినా అది మళ్లీ కనిపించలేదు.

 దానిని దొంగలు కరిగించి బంగారాన్ని అమ్మేసి ఉంటారని భావిస్తున్నారు. అలాంటిదే మరో టాయిలెట్‌ను క్యాటల్లాన్‌ తయారు చేయటంతో ఈ నెలలో వేలం వేస్తున్నారు. దీనికి భారీ ధర పలుకొచ్చని భావిస్తున్నారు. క్యాటల్లాన్‌ బనానా ఆర్టిస్ట్‌గా కూడా ప్రసిద్ధి చెందారు. ఓ గోడపై టేపుతో అరటి పండును అతికించి ప్రదర్శనకు ఉంచటం ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అయ్యింది.   
 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు