Breaking News

గుండెలపై పడుకున్న పాము.. తర్వాత ఏమైందంటే?

Published on Sat, 01/17/2026 - 17:21

పాము ఈ పేరు వింటే చాలు చాలామందికి గుండె గుబేల్‌ మంటుంది. అవి ఇంట్లోకి వచ్చినా.. వాటిని చుసినా భయంతో పరుగెత్తుతారు. ఇక పామే మనపై పడుకుంటే.. అప్పుడు పరిస్థితి ఏలా ఉంటుందో ఊహించుకొండి.. సరిగ్గా ఇలాంటి ఘటనే ఆస్ట్రేలియాలోని ఓ మహిళకు జరిగింది. దీంతో ఆమె గుండె ఆగినంత పనైందని ఆ సమయంలోనే తన అనుభవాల్ని మీడియాతో పంచుకుంది.

బ్రిస్సెన్స్‌కు చెందిన ఓ దంపతులు యథావిధిగా రాత్రి పడుకున్నారు. ఉదయం అవడంతో భర్త నిద్రలేచి లైటు వేశారు. దీంతో నిద్రలేచిన మహిళ కళ్లు తెరిచేసరికి గుండె ఆగినంత పనైంది. తన ఛాతిపై 2.5 మీటర్ల పొడుగైన పాము పడుకొని ఉంది. దీంతో అప్పుడు తనకు కలిగిన  భావనను ఆ మహిళ మాటల్లో "నాకళ్లు తెరిచేసరికి నాపైన పెద్ద పాము పడుకొని ఉంది. భయంతో నాకు ఏం చేయాలో తోచలేదు. వెనక నుంచి నాభర్త కదవలవద్దు అన్నారు. దీంతో భయంభయంగా అలానే ఉన్నాను" అని చెప్పారు.

దీంతో వెంటనే అక్కడి నుండి వెళ్లిన  ఆమె భర్త పాములను పట్టే వ్యక్తిని తీసుకవచ్చారు. అతను ఆ మహిళకు ఏం ప్రమాదం కాకుండా ఆ సర్ఫాన్ని తీసి సురక్షిత ప్రాంతంలో వదిలేశారు. ఈ ఘటనను తలుచుకుంటే తనకు ఎంతో భయంగా ఉంటుందని ఆ మహిళ తెలిపింది. అయితే ఆ పాము విషపూరితమైనది కాదని వన్యప్రాణి అధికారులు తెలిపారు. 

కాగా చలికాలం కావడంతో వెచ్చదనం కోసం పాములు ఇండ్లలోకి ప్రవేశిస్తాయని తెలిపారు. ఇంటికి ఎటువంటి రంద్రాలు లేకుండా ఉంచడంతో పాటు తలుపులు వేసి ఉంచడం ద్వారా పాములు రావడాన్ని కొంతమేర నియంత్రించవచ్చని పేర్కొన్నారు. సరైన శిక్షణ లేకుండా పాములను పట్టుకోవడం చేయవద్దని అలా చేయడం ద్వారా అవి కరిచే ప్రమాదముందని అధికారులు తెలిపారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు