Breaking News

ఇజ్రాయెల్‌పై అమెరికా ఉపాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

Published on Fri, 06/19/2026 - 04:11

అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన తాజా శాంతి ఒప్పందంపై విమర్శలు చేస్తున్న ఇజ్రాయెల్ నేతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన ఏకైక ప్రపంచ నాయకుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రమే అని అన్నారు. 

ఇలాంటి సమయంలో ట్రంప్ తమ ప్రధాన సమస్య  అని భావించే వారు వాస్తవ పరిస్థితిని గుర్తించాలని ఘాటు హెచ్చరిక చేశారు.

వైట్‌హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వాన్స్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా ఒంటరిపడిందని, అమెరికా అందించిన దౌత్య, సైనిక సహకారాన్ని కొందరు ఇజ్రాయెల్ మంత్రులు గుర్తించడం లేదని విమర్శించారు. "Wake up and smell the reality" అంటూ వాన్స్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పనిచేసినప్పటికీ, ఏప్రిల్ 8న కుదిరిన తొలి కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత విభేదాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు యుద్ధాన్ని కొనసాగించాలని భావించగా, ట్రంప్ మాత్రం యుద్ధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.

ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి తాజాగా అమెరికా–ఇరాన్ ఒప్పందానికి తాము కట్టుబడి ఉండబోమని వ్యాఖ్యానించడం ఉద్రిక్తతకు దారితీసింది. దీనిపైనే వాన్స్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఇక ట్రంప్ కూడా ఇటీవల నెతన్యాహుపై అసహనం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ఉనికికి అమెరికా మద్దతే ప్రధాన కారణమని పేర్కొన్డాను. అలాగే నెతన్యాహును "crazy" అని వ్యాఖ్యానించినట్లు అమెరికా మీడియా నివేదించింది.

అయితే నెతన్యాహు స్పందిస్తూ, అమెరికాతో ఉన్న కీలక సంబంధాలను కొనసాగించడం తమకు ఎంతో ముఖ్యమని, యుద్ధ సమయంలో అమెరికా అందించిన సహకారాన్ని ఇజ్రాయెల్ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)