Breaking News

శుభాంశు శుక్లా రోదసీ యాత్ర.. నాసా కీలక ప్రకటన

Published on Tue, 06/24/2025 - 07:55

న్యూఢిల్లీ, సాక్షి: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా  రోదసీ యాత్రకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా మొత్తం నలుగురు వ్యోమగాములు ఈనెల 25న రోదసియాత్రకు బయలుదేరుతున్నట్లు నాసా తన తాజా ప్రకటనలో తెలిపింది. 

ఈ మిషన్‌లో భాగంగా జూన్​25న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్​ సెంటర్​ నుండి ఈ స్పేస్ క్యాప్సూల్‌ను ఫాల్కన్‌-9 రాకెట్‌ నింగిలోకి మోసుకెళ్లనుంది. ఇందులో శుభాంశు శుక్లా మిషన్‌ పైలట్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. 

శుభాంషు శుక్లా రోదసీ యాత్ర ఇప్పటివరకు ఐదు సార్లు వాయిదా పడింది. మొదట ఇది మే 29న జరగాల్సి ఉండగా, ఆ తర్వాత జూన్ 8, జూన్ 10, జూన్ 11, మరియు జూన్ 19 తేదీలకు మారింది. జూన్ 11న జరగాల్సిన ప్రయోగానికి ముందు ఫాల్కన్-9 రాకెట్‌లో ద్రవరూప ఆక్సిజన్ లీకేజీ కారణంగా మళ్లీ వాయిదా పడింది.

ఈ వ్యోమనౌక భూమి నుంచి బయల్దేరిన 28 గంటల  అనంతరం ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం కానుంది. 14 రోజుల పాటు ఈ నలుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో ఉండనున్నారు. ఇదే సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఔత్సాహిక విద్యార్థులు, అంతరిక్ష శాస్త​వేత్తలు ఈ నలుగురు వ్యోమగాములతో సంభాషించనున్నారు. 

ఈ ప్రయోగం విజయవంతమైతే విజయవంతమైతే, శుభాంషు శుక్లా ప్రైవేట్ రోదసి యాత్ర ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోతారు. 

భారత్‌కు ఏం ప్రయోజనమంటే.. 

  • గగన్‌యాన్ ప్రాజెక్టుకు పునాది
    ఈ మిషన్ ద్వారా శుభాంషు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) 14 రోజుల పాటు అనేక శాస్త్రీయ ప్రయోగాలు చేస్తారు. ఇవి భారత గగన్‌యాన్ మిషన్‌కు అవసరమైన అనుభవాన్ని ఇస్తాయి. 
     
  • ఇస్రోకు అంతర్జాతీయ అనుభవం
    నాసా, యాక్సియమ్ స్పేస్ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా ఇస్రోకు ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో అంతర్జాతీయ సహకారానికి దారితీస్తుంది. 
     
  • శాస్త్రీయ ప్రయోగాలు
    శుభాంషు నిర్వహించే ప్రయోగాలు మైక్రోగ్రావిటీలో కండరాల నష్టం, పంటల సాగు, టార్డిగ్రేడ్స్ (వాటర్ బేర్స్) జీవన విధానం, కంప్యూటర్ స్క్రీన్‌ల ప్రభావం వంటి అంశాలపై దృష్టి పెడతాయి. ఇవి ఆరోగ్యం, వ్యవసాయం, జీవశాస్త్రం రంగాల్లో కొత్త అవగాహనను తీసుకురాగలవు. 
     
  • భారత యువతకు ప్రేరణ
    1984లో రాకేశ్ శర్మ తర్వాత మళ్లీ ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లడం భారత యువతలో శాస్త్రవేత్తల పట్ల ఆసక్తిని పెంచుతుంది. ఇది దేశంలో స్పేస్ సైన్స్‌కు బలమైన ప్రోత్సాహం అవుతుంది. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు.. భారత అంతరిక్ష ప్రయాణ చరిత్రలో కొత్త అధ్యాయం కూడా.

ఇది కూడా చదవండి: సంధి దిశగా ఇరాన్‌? తుది నిర్ణయంపై తర్జనభర్జన

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)