Breaking News

మీరు మాకు చెప్పాల్సింది: ప్రధాని మోదీతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు

Published on Mon, 11/24/2025 - 08:40

జోహెన్నెస్‌బర్గ్‌:   జీ 20 సదస్సు దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్‌ వేదికగా జరిగింది. నవంబర్‌ 22, 23 తేదీల్లో ఈ సదస్సు నిర్వహించారు. ఐకమత్యం, సమానత్వం, సుస్థిరత తదితర అంశాల థీమ్‌ ఆధారంగా ఈ సదస్సును నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఆఫ్రికా ఖండంలో జరిగిన జీ 20 సదస్సు ఇదే మొదటిది. దీని గురించి ఆఫ్రికా ఖండంలోని నేతలకు పెద్దగా అనుభవం లేదు. 

ఇదే విషయాన్ని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకొచ్చారు. జీ 20 సదస్సును నిర్వహించడం అనేది తమకు అసలు అనుభవం లేదన్నారు. ఇది అత్యంత కష్టంతో కూడుకున్నదిగా నిర్వహించాక తెలిసిందన్నారు. ‘ జీ 20 సదస్సు నిర్వహణ కష్టమని మాకు చెప్పాల్సింది. మీరు చెప్పి  ఉంటే దానికి దూరంగా ఉండేవాళ్లం.’ అని నవ్వుతూ అన్నారు రామఫోసా. 

ఇక జీ 20 సదస్సు కోసం భారత్‌ ఇచ్చిన సహకారం మరువలేనిదని ప్రధాని మోదీతో మాటామంతీ సందర్భంగా సిరిల్‌ రామఫోసా పేర్కొన్నారు. జోహన్నెస్‌బర్గ్‌లో ఆదివారం జీ20 దేశాల అధినేతల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. పలు అంశాలపై జరిగిన చర్చా కార్యక్రమాల్లో మోదీ మాట్లాడుతూ.. ‘ టెక్నాలజీ అప్లికేషన్లు ఏ ఒక్క దేశానికో ఉపయోగపడేలా కాకుండా ప్రపంచమంతా వినియోగించుకొనేలా రూపొందించాలి. సామాన్య ప్రజల జీవితాలను మార్చే టెక్నాలజీని ప్రోత్సహించాలి. 

ఇండియాలో ‘అందరికోసం సాంకేతికత’అనే విధానం అమలు చేస్తున్నాం.  స్పేస్‌ అప్లికేషన్లు, ఏఐ, డిజిటల్‌ చెల్లింపుల్లో తమ దేశం ముందంజలో ఉంది.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇండియాలో  ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు నిర్వహించబోతున్నామం.  జీ20 దేశాలను ఆహ్వానిస్తున్నాం’ అని స్పష్టం చేశారు. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)