Breaking News

‘బంగ్లా’లో రాక్షస క్రీడ’.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

Published on Sat, 01/24/2026 - 11:21

న్యూఢిల్లీ: భారత్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024, ఆగస్టులో పదవీచ్యుతురాలైన హసీనా తొలిసారిగా మౌనం వీడారు. భారత్ వేదికగా  ఆమె విడుదల చేసిన తన తొలి బహిరంగ సందేశంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం స్వేచ్ఛాయుతమైన ఎన్నికలను నిర్వహించలేదని, ఆ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

వచ్చే ఫిబ్రవరి 12న జరగనున్న బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికల్లో పోటీ చేయకుండా తమ పార్టీ అవామీ లీగ్‌పై నిషేధం విధించిన నేపథ్యంలో, హసీనా ఈ వ్యాఖ్యలు చేయడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలోని ఫారిన్ కరెస్పాండెంట్స్ క్లబ్‌లో ‘బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అనే శీర్షికపై జరిగిన కార్యక్రమంలో హసీనా తన ఆడియో సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా ఆమె మహ్మద్ యూనస్‌ను అవినీతిపరుడు, అధికార దాహంతో ఉన్న దేశద్రోహిగా అభివర్ణించారు. తనను పదవి నుండి తొలగించే కుట్రలో యూనస్ ప్రధాన భాగస్వామి అని ఆరోపించారు.
 

ప్రస్తుత విపత్కర సమయంలో జాతి మొత్తం ఏకమై, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో నిలబడాలని, విదేశీ శక్తులకు తొత్తుగా మారిన యూనస్‌ ప్రభుత్వాన్ని కూలదోసి, అమరుల రక్తంతో లిఖించిన రాజ్యాంగాన్ని పునరుద్ధరించాలని హసీనా బంగ్లాదేశ్ పౌరులను కోరారు. యూనస్ పరిపాలనను తరిమికొట్టే వరకూ దేశంలో నిజమైన ఎన్నికలు జరగవని ఆమె  వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నిష్పక్షపాత విచారణ జరగాలని హసీనా డిమాండ్ చేశారు.

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో  మానవ హక్కులను కాలరాస్తున్నారని, మహిళలు, బాలికలపై హింస, లైంగిక దాడులు యథేచ్ఛగా సాగుతున్నాయని, మతపరమైన మైనారిటీల భద్రతకు పటిష్టమైన హామీ కావాలని ఆమె డిమాండ్ చేశారు. జర్నలిస్టులు, అవామీ లీగ్ నాయకులపై జరుగుతున్న రాజకీయ కక్షసాధింపు చర్యలను, అక్రమ అరెస్టులను తక్షణమే ఆపివేయాలని, న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించేలా చర్యలు  తీసుకోవాలని ఆమె కోరారు.

ఇది కూడా చదవండి: Bangladesh: మోగిన ఎన్నికల నగారా.. ఫిబ్రవరి 12న పోలింగ్‌

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)