Breaking News

షేక్‌ హసీనా సంచలన నిర్ణయం.. బంగ్లాకు పయనం

Published on Mon, 11/09/2026 - 11:14

ఢాకా: బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మాజీ ప్రధాని షేక్‌ హసీనా భారత్‌ నుంచి స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు కీలక అడుగు వేశారు. కొత్త పాస్‌పోర్ట్‌, జాతీయ గుర్తింపు కార్డు (NID) జారీ చేయాలని కోరుతూ ఢిల్లీలోని బంగ్లాదేశ్‌ రాయబార కార్యాలయానికి తన న్యాయవాదుల ద్వారా దరఖాస్తు పంపించారు. డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలని భావిస్తున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు హసీనా పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేయడంపై బంగ్లాదేశ్‌ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో హసీనా స్వదేశీ ప్రయాణంపై ఉత్కంఠ నెలకొంది.

రాయిటర్స్‌ కథనం ప్రకారం.. లండన్‌కు చెందిన మ్యాట్రిక్స్‌ ఛాంబర్స్‌ న్యాయ సంస్థకు చెందిన హసీనా న్యాయవాదులు ఢిల్లీలోని బంగ్లాదేశ్‌ రాయబార కార్యాలయానికి లేఖ రాశారు. హసీనా బంగ్లాదేశ్‌ పౌరురాలేనని పేర్కొంటూ కొత్త పాస్‌పోర్ట్‌, జాతీయ గుర్తింపు కార్డు జారీ చేయాలని కోరారు. గతంలో హసీనా పాస్‌పోర్ట్‌, గుర్తింపు కార్డులను బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త పత్రాల దరఖాస్తును వీలైనంత త్వరగా పరిశీలించాలని ఆమె న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనల ప్రకారం ఆమెకు అవసరమైన గుర్తింపు పత్రాలు పొందే హక్కు ఉందని లేఖలో పేర్కొన్నారు.

పాస్‌పోర్ట్‌ ఎందుకు?: బంగ్లాదేశ్‌
మరోవైపు హసీనా పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేయడంపై బంగ్లాదేశ్‌ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమెకు కొత్త పాస్‌పోర్ట్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని, భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య అమల్లో ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం ఆమెను స్వదేశానికి పంపించాలని ఆ దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్‌ కబీర్‌ స్పష్టం చేశారు. హసీనాను తమకు అప్పగించాల్సిందేనని, ఆమె పరారీలో ఉన్న వ్యక్తి అని ఆయన వ్యాఖ్యానించారు. అరెస్టు చేయాల్సిన వ్యక్తికి పాస్‌పోర్ట్‌ ఎందుకని ప్రశ్నించారు. ఈ వ్యవహారం న్యాయపరమైన ప్రక్రియ ద్వారా పరిష్కారం కావాలని పేర్కొన్నారు.

డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు హసీనా?
2024 ఆగస్టులో బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో షేక్‌ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చారు. దాదాపు 20 ఏళ్లకు పైగా సాగిన ఆమె పాలనకు దీంతో ముగింపు పడింది. అప్పటి నుంచి భారత్‌లోనే ఉంటున్న హసీనా.. డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి వెళ్లి న్యాయస్థానం ముందు లొంగిపోవాలని భావిస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అవసరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణ తేదీని వెల్లడిస్తామని ఆమె అనుచరులు తెలిపారు.

హసీనాకు మరణశిక్ష..
హసీనా స్వదేశానికి వెళ్లాలనుకోవడం వెనుక తీవ్రమైన న్యాయపరమైన సవాళ్లు ఉన్నాయి. 2025 నవంబర్‌లో బంగ్లాదేశ్‌ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్‌ ఆమె ప్రభుత్వ హయాంలో నిరసనకారులపై జరిగిన హింసాకాండకు సంబంధించి మానవత్వానికి వ్యతిరేకమైన నేరాల కేసులో ఆమెకు గైర్హాజరీలో మరణశిక్ష విధించింది. అయితే హసీనా ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. మరోవైపు ఆమె పార్టీ అవామీ లీగ్‌పై కూడా బంగ్లాదేశ్‌లో నిషేధం విధించారు. పలువురు పార్టీ నాయకులు అరెస్టు కాగా, మరికొందరు విదేశాలకు వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో హసీనా తిరిగి వస్తే అక్కడి రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం ఉంది.

భారత్‌ నిర్ణయంపైనే అందరి చూపు!
హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్‌ పలుమార్లు భారత్‌ను కోరింది. ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్లు గతంలో భారత్‌ వెల్లడించింది. ఇప్పుడు హసీనా కొత్త పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేయడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. హసీనాకు కొత్త పత్రాలు జారీ అవుతాయా? భారత్‌ ఆమెను బంగ్లాదేశ్‌కు అప్పగిస్తుందా? ఆమె అనుకున్నట్లుగా డిసెంబర్‌లో స్వదేశానికి వెళ్లగలుగుతారా? అన్న ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి. భారత్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అన్నదే ఉత్కంఠగా మారింది.

ఇదీ చదవండి: ఇరాన్‌పై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు.. గల్ఫ్‌లో హైటెన్షన్‌!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)