Breaking News

మోదీజీ.. ! ‘నా భార్యా, పిల్లల్ని వెనక్కి పంపించండి’

Published on Sat, 07/08/2023 - 14:38

గ్రేటర్ నోయిడా: పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన భారత యువకుడిని కలిసేందుకు ఓ పాకిస్తాన్ మహిళ నలుగురు పిల్లలతో సహా భారత్‌లో చొరబడిన సంఘటన ఇటీవల గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. అక్రమంగా భారత్లో చొరబడినందుకు ఆ మహిళ పైనా, ఆమెకు ఆశ్రయమిచ్చినందుకు ఆ యువకుడి పైనా కేసు నమోదు చేసి పోలీసులు వారిని కోర్టులో హాజరుపరచగా విచారణ నడుస్తోంది. మీడియాలో ఈ సంఘటన బాగా వైరల్ కావడంతో సౌదీలో ఉంటున్న ఆ పాకిస్తాన్ మహిళ భర్తకు విషయం చేరింది. దీంతో తన భార్యను పిల్లలను తిరిగి  పాకిస్తాన్ పంపించాల్సిందిగా భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.  ఈ మేరకు భారత ప్రభుత్వానికి ఓ సందేశాన్ని పంపించాడు.  

పబ్జీ గేమ్ చాలామందికి ఒక వ్యసనం. అందులో పడ్డారంటే చాలు గంటలపాటు పరిసరాలను మరచి పరధ్యానంగా గడుపుతుంటారు. తాజాగా ఈ పబ్జీ గేమ్ ఓ కొంపను కొల్లేరు చేసింది. యూపీలోని నొయిడాకు చెందిన 25 ఏళ్ల  సచిన్ మీనాకు పాకిస్తాన్ కు చెందిన 30 ఏళ్ల సీమా హైదర్ పబ్జీ ద్వారా పరిచయమైంది. నాలుగేళ్ల ప్రయాణంలో ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో వారిద్దరూ ఒక్కటవ్వాలనుకున్నారు. 

అప్పటికే సీమాకు పెళ్ళై నలుగురు పిల్లలున్నారు. అయినా కూడా ప్రేమ గుడ్డితనాన్ని ప్రపంచానికి చాటుతూ సీమా హైదర్ నలుగురి పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా భారత్ చేరుకొని పబ్జీ ప్రియుడిని కలుసుకుంది. ఆమె రాకను గుర్తించిన స్థానిక పోలీసులు, అక్రమంగా భారత్ లో చొరబడినందుకు ఆమె పైన కేసు నమోదు చేశారు. ఆశ్రయమిచ్చినందుకు సచిన్ పైన కూడా కేసు నమోదు చేసి ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచారు. జెవార్ సివిల్ కోర్టు వారికి బెయిల్ కూడా మంజూరు చేసి తదుపరి వాయిదాకు తప్పక రావాల్సిందిగా కోరింది. 

ఇదిలా ఉండగా ఈ వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో సౌదీ అరేబియాలో ఉన్న సీమా హైదర్ భర్త గులామ్ హైదర్ కు ఈ విషయం చేరింది. దీంతో వెంటనే స్పందిస్తూ.. మొదటగా ఈ వార్త నాకు తెలిసేలా చేసిన భారత మీడియాకు కృతఙ్ఞతలు.. నా భార్యకు కల్లబొల్లి మాటలు చెప్పి, మభ్యపెట్టి భారత్ రప్పించారు. దయచేసి నా భార్యను, పిల్లలను తిరిగి పాకిస్తాన్ పంపించండి.. అంటూ భారత ప్రభుత్వానికి ఒక సందేశాన్ని పంపించాడు.   

ఇది కూడా చదవండి: కర్ణాటక అసెంబ్లీలోకి చొరబడ్డ ఆగంతకుడు.. ఎందుకొచ్చాడంటే.. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)