Breaking News

ట్రంప్‌ కొత్త డ్రామా.. డీల్స్‌ కోసం ‘ఎంబీఎస్‌’కు క్లీన్‌చిట్‌

Published on Wed, 11/19/2025 - 07:43

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కొత్త డ్రామాకు తెరలేపారు. తమ స్వప్రయోజనాల కోసం సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్‌)ను వెనుకేసుకొచ్చారు. 2018లో జరిగిన జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య గురించి సౌదీ క్రౌన్ ప్రిన్స్  ఎంబీఎస్‌కు ఏమీ తెలియదన్నారు. ఖషోగ్గి చాలా వివాదాస్పదుడని, చాలా మందికి నచ్చని వ్యక్తి అని అభివర్ణించారు. ఖషోగ్గి హత్యపై ఓవల్ కార్యాలయంలో యువరాజును ప్రశ్నించిన జర్నలిస్ట్‌పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు అలాంటి ప్రశ్నలతో తమ అతిథిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని ట్రంప్‌ అన్నారు.

ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు 2021 నాటి యూఎస్‌ నిఘా అంచనాలకు విరుద్ధంగా ఉన్నాయి. నాటి వివరాల ప్రకారం ఖషోగ్గిని చంపడానికి ప్రిన్స్ మొహమ్మద్ ఆదేశించినట్లు తేలింది. కాగా అమెరికా తొలి పర్యటనలో ఉన్న ఎంబీఎస్‌ మాట్లాడుతూ ఖషోగ్గి హత్య బాధాకరమైనదని, అదొక పెద్ద తప​్పిదం అని పేర్కొన్నారు. అయితే దీనిపై ఖషోగ్గి భార్య హనన్ ఎలాటర్ ఖషోగ్గి  స్పందిస్తూ, ఎంబీఎస్‌ తనను కలిసి క్షమాపణ చెప్పి, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా ఈ వివాదాన్ని పక్కన పెడుతూ అమెరికా- సౌదీ అరేబియా తమ సంబంధాలను బలోపేతం చేసుకుంటూ పలు కీలక ఒప్పందాలకు ఆమోదం తెలిపాయి.

ఇందులో పౌర అణుశక్తి సహకార ఒప్పందం, భవిష్యత్తులో  ఎఫ్‌-35 స్టెల్త్ ఫైటర్ జెట్‌ల అమ్మకం మొదలైనవి ఉన్నాయి. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ఎంబీఎస్‌ తనకు మంచి స్నేహితుడని ప్రశంసించారు. అలాగే మానవ హక్కులను కాపాడేవాడని కూడా అని కొనియాడారు. కాగా గతంలో సౌదీతో తలెత్తిన దౌత్య సంక్షోభానికి  కారణమైన ఖషోగ్గి హత్యను పక్కన పెట్టేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లుందని విమర్శకులు అంటున్నారు. ట్రంప్ వ్యాపార ప్రయోజనాలు ఈ సమావేశంలో ప్రధాన అంశంగా మారాయి. ట్రంప్ ఆర్గనైజేషన్‌తో సౌదీ డెవలపర్ కొత్త హోటల్ భాగస్వామ్యాన్ని ప్రకటించిన ఒక రోజు తరువాత ట్రంప్‌ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. కాగా ప్రాంతీయ శాంతి,  ఇజ్రాయెల్‌తో సంబంధాల సాధారణీకరణ (అబ్రహం ఒప్పందాలు) గురించి కూడా ట్రంప్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో చర్చించారు.

ఇది కూడా చదవండి: Bihar: ‘ఇళ్లా.. ఇంద్ర భవనాలా?’.. కొత్త ఎమ్మెల్యేలకు పండుగే!

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)