Breaking News

ఇరాన్‌ మిలిటెంట్లపై అమెరికా–సౌదీ దాడి 

Published on Thu, 07/30/2026 - 05:53

కైరో: పశ్చిమాసియాలో దాడుల పరంపర ఆగడం లేదు. ఇరాక్‌ భూభాగంలో ఇరాన్‌ మద్దతుగల మిలిటెంట్లపై సౌదీ అరేబియాతో కలిసి మంగళవారం అర్ధరాత్రి తర్వాత అమెరికా దాడి చేయగా.. బుధవారం తెల్లవారుజామున ఇరాన్‌ సైన్యం గల్ఫ్‌ ప్రాంతంలోని అమెరికా బలగాలపై క్షిపణుల వర్షం కురిపించింది. అమెరికా–సౌదీ అరేబియా దాడిలో కనీసం 20 మంది మరణించారు. 32 మంది గాయపడ్డారు. 

ఈ దాడిలో ఆరుగురు ఇరాన్‌ సలహాదారులు మరణించారని ఇరాకీ మిలీíÙయా సిబ్బంది తెలిపారు. మరణించిన 20 మందిలో ఈ సలహాదారులు కూడా ఉన్నారా లేదా అనేది తెలియరాలేదు. పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరగడం చూస్తూ మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం జరుగుతుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు అమెరికా వద్ద అత్యాధునిక ఆయుధ నిల్వలు ఇప్పటికే తగ్గిపోయినట్లు తెలుస్తోంది. 

గత రెండు రోజులుగా తమ చమురు కేంద్రాలపై ఇరాకీ మిలిటెంట్లు డ్రోన్లతో దాడులు చేశాయని సౌదీ అరేబియా ఆరోపించింది. సౌదీ అరేబియాపై జరిగినట్లు చెబుతున్న డ్రోన్‌ దాడులకు ప్రతిస్పందనగా, తమ యుద్ధ విమానాలు తూర్పు ఇరాక్‌లోని పలు రవాణా, ఆయుధ స్థావరాలపై దాడి చేశాయని అమెరికా సైన్యం తేల్చిచెప్పింది. జోర్డాన్‌లోని అమెరికా సైనిక కేంద్రమైన మువఫాక్‌ సాల్టి వైమానిక స్థావరంపై బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్‌ ఇస్లామిక్‌ పారామిలటరీ రివల్యూషనరీ గార్డ్‌ వెల్లడించింది. మరోవైపు ఐదు ఇరాన్‌ క్షిపణులను అడ్డుకుని ధ్వంసం చేసినట్లు జోర్డాన్‌ సైన్యం స్పష్టంచేసింది.   

ఇరాన్‌కు చావుదెబ్బలు తప్పవు: ట్రంప్‌  
పశ్చిమాసియాలో తమ సైనిక స్థావరాలపై ఇరాన్‌ దాడులు చేయడం, బాలిస్టిక్‌ క్షిపణులు పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గట్టిగా స్పందిస్తామని, ఇరాన్‌ను తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఇరాన్‌కు చావుదెబ్బలు తప్పవని బుధవారం ప్రతిజ్ఞ చేశారు. జోర్డాన్‌లోని అమెరికా స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ ప్రయోగించిన బాలిస్టిక్‌ క్షిపణులను అడ్డుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. అనంతరం దీనిపై ట్రంప్‌ మాట్లాడారు. ఇరాన్‌ గట్టిగా విరుచుకుపడతామని, మర్చిపోలేని రీతితో దెబ్బకొడతామని స్పష్టంచేశారు.    

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)