Breaking News

చైనాకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. కీలక చర్చలు!

Published on Wed, 05/15/2024 - 09:11

బీజింగ్‌: ర‍ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ రేపటి నుంచి(మే 16) నుంచి రెండు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పుతిన్‌.. చైనా పర్యటనపై ఆసక్తి నెలకొంది. పుతిన్‌, జిన్‌పింగ్‌ మధ్య ఎలాంటి చర్చ జరుగుతుందోనన్న చర్చ నడుస్తోంది.

కాగా, పుతిన్‌ ఇటీవలే రష్యాకు ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా, తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా పుతిన్‌.. చైనాకు వెళ్లనున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో పుతిన్‌ తమ దేశంలో పర్యటించనున్నారని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే, రష్యా, చైనాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 75 ఏళ్లైన సందర్భంగా జిన్‌పింగ్‌ ఆహ్వానంపైనే పుతిన్‌ చైనాను సందర్శిస్తున్నారని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది.

ఇక, ఈ పర్యటనలో భాగంగా పుతిన్‌.. చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. వీరి భేటీలో ఉక్రెయిన్‌-రష్యా దాడుల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌లో రెండేళ్లకు పైగా సాగుతున్న యుద్ధం పరిణామాలు, సంక్షోభం గురించి మాట్లాడనున్నట్టు చైనా మీడియా పేర్కొంది. ఇదే సమయంలో ఉక్రెయిన్‌లో శాంతి కోసం చైనా ప్రతిపాదనలకు తాము సానుకూలంగా ఉండాలనుకున్నట్టు రష్యా తెలిపింది. 

 

 

మరోవైపు.. గడిచిన ఎనిమిది నెలల్లో పుతిన్‌ చైనాను సందర్శించడం ఇది రెండోసారి. ఇదిలా ఉండగా.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ గతవారమే యూరప్‌లో ఐదు రోజుల పర్యటన ముగించుకొని చైనాకు వెళ్లారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)