Breaking News

ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడుల భయం.. నేవీ వేడుకలను తగ్గించుకున్న రష్యా 

Published on Mon, 07/28/2025 - 06:27

మాస్కో: ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు తీవ్రతరం చేసిన నేపథ్యంలో రష్యా తన నేవీ డే వేడుకలపై కోత పెట్టింది. భద్రతాపరమైన ఆందోళనలతో బాల్టిక్‌ సముద్ర తీరంలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్, కలినిన్‌ గ్రాడ్‌లలో, సుదూర తూర్పు తీర నౌకాశ్రయంలో వార్షిక నేవీ డే ఉత్సవాల సందర్భంగా ఆదివారం చేపట్టాల్సిన యుద్ధ నౌకల పరేడ్‌లను రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని రష్యా అధికారులు తెలిపారు. సొంత నగరం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లోని నేవీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు పుతిన్‌ స్వయంగా హాజరు కావాల్సిన జరిగే కార్యక్రమాలను సైతం రద్దు చేసుకుంది.

 ఈ విషయాన్ని అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ ధ్రువీకరించారు. అన్ని రకాల పరిస్థితులను బేరీజు వేసుకున్నాకే ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుందన్నారు. భద్రతకు మించింది మరేది లేదని వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి నుంచి వివిధ ప్రాంతాలపైకి ఉక్రెయిన్‌ ప్రయోగించిన 99 డ్రోన్లను కూల్చినట్లు ఆదివారం రక్షణ శాఖ తెలిపింది. వీటిలో సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ నగరంపైకి వచ్చినవి కూడా ఉన్నాయంది. లెమొనొసోవ్‌ ప్రాంతంలో డ్రోన్‌ శకలాలు పడి ఒక మహిళ గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. డ్రోన్ల భయంతో సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లోని పుల్కొవో ఎయిర్‌పోర్టు అధికారులు ఆదివారం ఉదయం డజన్ల కొద్దీ విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ నగరంలో జరిగిన పలు కార్యక్రమాల్లో అధ్యక్షుడు పుతిన్‌ పాల్గొన్నారు. యుద్ధ నౌకలను నిర్మించడంతోపాటు నేవీ శిక్షణను వేగవంతం చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.  
 

Videos

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)