Breaking News

ఉక్రెయిన్‌కు పుతిన్‌ సంచలన హెచ్చరిక

Published on Sun, 12/28/2025 - 10:58

మాస్కో: రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపునకు శాంతి చర్చల వేళ అధ్యక్షుడు పుతిన్‌ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరు దేశాల మధ్య శాంతియుత మార్గం ద్వారా సమస్య పరిష్కారానికి ఉక్రెయిన్‌ ముందుకు రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చారు. లేని పక్షంలో సైనిక మార్గాలను అనుసరించాల్సి ఉంటుందని పుతిన్‌ చెప్పుకొచ్చారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తాజాగా ఆ దేశ మిలిటరీ కమాండ్‌ పోస్టును సందర్శించారు. ఈ సందర్భంగా చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్ వాలెరీ గెరిసిమోవ్‌, రష్యన్‌ దళాలతో పుతిన్‌ చర్చలు జరిపారు. అనంతరం పుతిన్‌ మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపు కోసం చర్చలు జరుగుతున్నాయి. శాంతి చర్చలపై ఉక్రెయిన్‌ అధికారులకు పెద్దగా ఆసక్తి లేనట్లుగా ఉంది. సమస్య పరిష్కారానికి వాళ్లు తొందరపడటం లేదు. ఒక వేళ ఉక్రెయిన్‌ అధికారులు ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ఇష్టపడకపోతే.. ప్రత్యేక సైనిక చర్యతో మా లక్ష్యాలను సాధిస్తాం. రష్యా దాడులు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

రష్యా దాడులు.. 
మరోవైపు.. శాంతి చర్చల వేళ ఉక్రెయిన్‌పై రష్యా దళాలు విరుచుకుపడ్డాయి. కీవ్‌పై లాంగ్‌ రేంజ్‌ ప్రెసిషన్‌ గైడెడ్‌ ఆయుధాలతో భారీ దాడి చేసింది. ఈ దాడులను జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు. ఉక్రెయిన్ దౌత్యపరమైన మార్గాలకు కట్టుబడి ఉందని.. మాస్కోనే యుద్ధం పొడిగించాలని చూస్తోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత రష్యా దాడుల్లో ఉక్రెయిన్‌లో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. అంతేకాకుండా భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలిసింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)