Breaking News

న్యూక్లియర్‌ వార్‌కు సిద్ధం.. పుతిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Published on Thu, 09/26/2024 - 07:44

మాస్కో: ఉక్రెయిన్‌, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో రష్యాపై దాడులను ఉక్రెయిన్‌ తీవ్రతరం చేసింది. రష్యాపై దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌కు పలు దేశాలు సాయం అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటో దేశాలను పుతిన్‌ తీవ్రంగా హెచ్చరించారు. పశ్చిమ దేశాలపై అణ్వాయుధాలతో దాడి చేసేందుకు రెడీ అయినట్టు హింట్‌ ఇచ్చాడు.

అమెరికా, యూకే సాయంతో ఉక్రెయిన్‌.. రష్యాపై భీకర దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే రష్యాపై బాంబు దాడికి ఉపయోగించే ‘స్టార్మ్ షాడో’ క్రూయిజ్ క్షిపణిని గత వారం యూకే క్లియర్ చేసింది. యూకే పీఎం కైర్ స్టార్మర్.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను కలవడానికి వాషింగ్టన్ కూడా వెళ్లారు. రష్యా గడ్డపై ఉక్రెయిన్ ఆయుధాల వినియోగంపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. ఈ మేరకు రష్యా ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. దీంతో, అప్రమత్తమైన రష్యా.. పశ్చిమ దేశాలకు వార్నింగ్‌ ఇచ్చారు.

తాజాగా రష్యా భద్రతా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సంచలన ప్రకటన చేశారు. తమ దేశంపై అణు సామర్థ్యం లేని రాజ్యం, అణు సామర్థ్యం కలిగిన దేశం మద్దతుతో మా దేశంపై దాడి చేసినప్పుడు రష్యా ఫెడరేషన్‌పై సంయుక్త దాడిగా పరిగణిస్తామని పుతిన్ తెలిపారు. ఈ క్రమంలో తాము అణు దాడులు చేసేందుకు వెనుకాడబోమని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. 

 

 

పుతిన్‌ హెచరిక తర్వాత రష్యా తన అణు ముసాయిదాలో సవరణలు చేసింది. తాజా సవరణలు ప్రకారం ప్రత్యర్థులు విమానాల ద్వారా భారీ దాడులు చేయడం, క్రూజ్ క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించినప్పుడు అణ్వస్త్రాలను వినియోగించేందుకు రష్యా నిర్ణయం తీసుకుంటుంది. ఇక పశ్చిమ దేశాలు తాము సరఫరా చేసిన దీర్ఘశ్రేణి ఆయుధాలతో రష్యా భూభాగంపై ఉక్రెయిన్‌ దాడి చేసేందుకు అనుమతిస్తే కీవ్‌తో జరుగుతున్న యుద్ధంలో నాటో కూడా చేరినట్లవుతుందని పుతిన్‌ పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: 1982 to 2024: ఇజ్రాయెల్‌ వర్సెస్‌ హెజ్‌జ్బొల్లా రక్తచరిత్ర
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)