Breaking News

రష్యా నియంత్రణలో 334 గ్రామాలు : పుతిన్‌ కీలక ప్రకటన

Published on Tue, 12/30/2025 - 19:18

ఉక్రెయిన్‌తో కొనసాగుతున్నయుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌లో మరిన్ని ప్రాంతాలను ఆక్రమించుకోవడం ద్వారా రష్యా ముందుకు సాగుతోందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.డోనెట్స్‌స్కీ, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలను రష్యాలో కలుపుకుంటామని పుతిన్‌ వెల్లడించారు. ఈ ప్రాంతాలన్నింటినీ దశలవారీగా స్వాధీనం చేసుకుంటున్నామని పుతిన్ పేర్కొన్నారు.

తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్స్‌కీ ప్రాంతంలోని డిబ్రోవా గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. డొనెట్స్క్‌లోని స్లోవియన్స్‌కీలో రష్యా జరిపిన షెల్లింగ్‌లో ఒకరు మరణించగా, మరో 5 మంది గాయపడ్డారు. జపోరిజియాలో కూడా రష్యా జరిపిన దాడిలో ఒకరు మరణించారు . ఈ ఏడాది ఉక్రెయిన్‌లో 6,460 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని రష్యా స్వాధీనం చేసుకున్నట్లు జనరల్ వాలెరీ గెరాసిమోవ్ తెలిపారు. ఇందులో 334 గ్రామాలు కూడా ఉన్నాయన్నారు. ఫ్లోరిడాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య జరిగిన చర్చలు విఫలమైన కొద్దిసేపటికే పుతిన్ సైనిక యూనిఫాంలో కమాండర్ల సమావేశానికి హాజరయ్యారు. 

ఇదీ చదవండి: త్వరలోనే పెళ్లి, గుండెపోటుతో ఎన్‌ఆర్‌ఐ మృతి

జెలెన్‌స్కీతో చర్చల తర్వాత, ట్రంప్ మాట్లాడుతూ శాంతి ఒప్పందం కుదిరిందని, అయితే ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉన్న జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం భవిష్యత్తు, డోనెట్స్‌కి, మరియు లుహాన్స్‌కీలను కలిగి ఉన్న డాన్‌బాస్ ప్రాంతాన్ని అప్పగించడం అనేవి పరిష్కారం కాని రెండు సమస్యలు అని జెలెన్‌స్కీ అన్నారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు శాంతి ప్రణాళికపై ప్రజాభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చారు. దానికోసం కనీసం 60 రోజుల కాల్పుల విరమణ అవసరం. ప్రస్తుతం డాన్‌బాస్‌లో కొంత భాగం మాత్రమే ఉక్రెయిన్ చేతిలో ఉంది. ఉక్రెయిన్ దళాలు అక్కడి నుండి వెనక్కి తగ్గాలని లేదా మరిన్ని నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యా ప్రభుత్వ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ హెచ్చరించారు.

ఇదీ చదవండి: త్వరలోనే పెళ్లి, గుండెపోటుతో ఎన్‌ఆర్‌ఐ మృతి 

మరోవైపు ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు శాంతి చర్చలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రయత్నాల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై డ్రోన్‌ దాడులు జరిగినట్లు ఆరోపణలు రావడం కలకలం  రేపింది.  డిసెంబర్ 28 నుంచి 29 మధ్య పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపించింది. అయితే  ఈ ఆరోపణలను  కానీ ఉక్రెయిన్ మాత్రం ఖండించింది.

ఇదీ చదవండి : ప్రియురాలితో ప్రియాంక గాంధీ కొడుకు నిశ్చితార్థం : త్వరలోనే శుభకార్యం

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)