కీవ్‌పై మిసైళ్ల వర్షం..11 మంది మృతి

Published on Mon, 07/06/2026 - 15:27

కీవ్‌:ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం మెుదలై దాదాపు నాలుగేళ్లు గడుస్తోన్నా ఇంకా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం చల్లారడం లేదు. తాజాగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా (సోమవారం) మిసైళ్లతో విరుచుకపడింది. ఈ దాడులలో 11మంది ఉక్రెయిన్‌ పౌరులు దుర్మరణం చెందగా మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు.

కీవ్‌ టార్గెట్‌గా 68 మిసైళ్లు, 361 పైగా డ్రోన్లతో రష్యా దాడులు చేసినట్లు రాయిటర్స్ కథనాలు పేర్కొన్నాయి. ఈ దాడులలో  కీవ్‌లో దాదాపుగా 10 మందికి పైగా నగరంలో మృతి చెందగా మరో 45 మంది గాయపడినట్లు కథనాలు పేర్కొన్నాయి. కాగా ఈ ఏడాది టర్కీలో నాటో శిఖరాగ్ర సదస్సు జరగనున్న నేపథ్యంలో ఈ దాడి జరగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. 

కాగా ఇటీవలే కీవ్‌పై రష్యా  దాడులతో విరుచుకపడుతోంది. గత గురువారం తెల్లవారుజామున ప్రారంభమైన దాడులు ఏకధాటిగా 11 గంటల పాటు జరిగాయి. ఈ అటాక్స్‌లో 20 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా 90 మందికి పైగా గాయపడ్డారు. ఉక్రెయిన్‌ ఇటీవల  తమ చమురుశుద్ధి కేంద్రాలపై జరిపిన దాడులకు  ఈ దాడులు  ప్రతీకారమని రష్యా స్పష్టం చేసింది.  అధికారుల ముందస్తు హెచ్చరికతో స్థానికులు చాలావరకూ సబ్‌వే స్టేషన్లలో తలదాచుకోవడంతో ప్రాణనష్టం తగ్గింది.

దాడులు ఎందుకు తీవ్రతరమయ్యాయి

ఉక్రెయిన్‌ ‘నలభై రోజుల నుంచి మెరుపుదాడి’ప్రణాళికలో భాగంగా రష్యా మౌలిక సదుపాయాలు, చమురు శుద్ధి కర్మాగారాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోంది. ఫలితంగా రష్యాలో ఇంధన సంక్షోభం తలెత్తింది. ఇందుకు ప్రతీకారంగా తాము దాడి చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. తాజా దాడి కోసం అత్యంత ఖచ్చితమైన దీర్ఘశ్రేణి ఆయుధాలు, డ్రోన్లు వినియోగించినట్లు వివరించింది. దీనికి ప్రతికారంగా రష్యా, కీవ్‌పై దాడులు చేస్తోంది.

#

Tags : 1

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)