ఆఫ్రికాలో రష్యా రహస్య ఆపరేషన్

Published on Sat, 02/21/2026 - 07:36

మాస్కో: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రష్యా ప్రైవేట్ సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’.. ఆఫ్రికాలో సాగిస్తున్న కార్యకలాపాలపై పట్టు బిగించేందుకు రష్యా అధ్యక్షుని అధికారిక కార్యాలయం ‘క్రెమ్లిన్’ దృష్టి సారించింది. వాగ్నర్ వ్యవస్థాపకుడు యెవ్జెనీ ప్రిగోజిన్ మరణం తర్వాత ఆ సంస్థ నిర్వహించిన భారీ ‘షాడో ఎంపైర్’ను రష్యా విదేశీ నిఘా సంస్థ ‘ఎస్‌వీఆర్’ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. ఆఫ్రికా దేశాల్లో రాజకీయాలను ప్రభావితం చేయడం, తప్పుడు సమాచార ప్రచారం ద్వారా అస్థిరత సృష్టించడం లాంటి కీలక బాధ్యతలను ఇప్పుడు ఎస్‌వీఆర్ నేరుగా పర్యవేక్షిస్తోంది.

ప్రిగోజిన్ మరణానంతరం వాగ్నర్ గ్రూప్ నిర్వహించిన ప్రభావశీల కార్యకలాపాలను రష్యా విదేశీ నిఘా సంస్థ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. సుమారు 100 మంది కన్సల్టెంట్లతో నడుస్తున్న ఈ విభాగం ద్వారా ఆఫ్రికా దేశాల అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోంది. లిబియా, మాలి, సూడాన్ నుంచి మొదలుకొని దాదాపు 15కు పైగా ఆఫ్రికా దేశాల్లో ఈ నెట్‌వర్క్ విస్తరించింది. 2024లో కేవలం 10 నెలల కాలానికి సుమారు 7.3 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 60 కోట్లు) నిధులను ఈ కార్యకలాపాల కోసం కేటాయించినట్లు సమాచారం.

ఫోర్బిడెన్ స్టోరీస్, ఆల్ ఐస్ ఆన్ వాగ్నర్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థల కన్సార్టియం జరిపిన పరిశోధనలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రష్యాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మరణించిన తర్వాత, వాగ్నర్ గ్రూప్ యొక్క ‘ఇన్‌ఫ్లుయెన్స్ ఆపరేషన్స్’ను ఎస్‌వీఆర్ దక్కించుకుంది. ఆఫ్రికాలో రష్యా రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను కాపాడటం, పాశ్చాత్య దేశాల పోటీని తొలగించడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తోంది.

దాదాపు 1,400 పేజీల రష్యన్ అంతర్గత పత్రాల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. దీని ప్రకారం, ఎస్‌వీఆర్ కేవలం సైనిక సహకారం అందించడమే కాకుండా, వ్యూహాత్మక స్థానాల్లో తమ ఏజెంట్లను నియమించడం, సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం లాంటి పనులు చేస్తోంది. ముఖ్యంగా మాలి, బుర్కినా ఫాసో, నైజర్ వంటి దేశాల్లో ఫ్రాన్స్, అమెరికా ప్రభావం తగ్గించేందుకు ఎస్‌వీఆర్ పావులు కదుపుతోంది.

ఇందులో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆఫ్రికాలో పట్టు కోసం రష్యా రక్షణ శాఖ- ఎస్‌వీఆర్ మధ్య అప్పుడప్పుడు పోటీ  ఏ‍ర్పడుతోంది. రక్షణ శాఖ 'ఆఫ్రికా కార్ప్స్' పేరుతో సైనిక కార్యకలాపాలను సమన్వయం చేస్తుండగా, ఎస్‌వీఆర్ మాత్రం రాజకీయ ప్రభావాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తోంది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ వంటి దేశాల్లో ఈ రెండు విభాగాల మధ్య సమన్వయం కోసం ఎస్‌వీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం రష్యా భారీగా నిధులు వెచ్చిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు పొందలేకపోతోంది. ఆఫ్రికా దేశాలతో అనేక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నా, అవి ఆదాయం తెచ్చిపెట్టే వ్యాపారాలుగా మారడం లేదని పరిశోధన పేర్కొంది. అయినప్పటికీ, ఆఫ్రికాలో తన ఉనికిని చాటుకునేందుకు రష్యా ఈ ‘దీర్ఘకాలిక వ్యూహాన్ని’కొనసాగిస్తున్నదని సమాచారం. 

ఇది కూడా చదవండి: ట్రంప్‌పై ఇండో అమెరికన్ల వ్యతిరేకత: సర్వేలో వెల్లడి

#

Tags : 1

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)