Breaking News

ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా.. అతిపెద్ద నౌక ధ్వంసం

Published on Fri, 08/29/2025 - 09:10

కీవ్‌: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం మరోసారి పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. తాజాగా ఉక్రెయిన్‌ నావికా దళానికి చెందిన అతి పెద్ద నిఘా నౌక సింఫెరోపోల్‌ను రష్యా ధ్వంసం చేసింది. సముద్ర డ్రోన్‌ సాయంతో నౌకను రష్యా విజయవంతంగా కూల్చివేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. ఉక్రెయిన్‌ నావికాదళానికి చెందిన అతి పెద్ద నిఘా నౌక సింఫెరోపోల్‌ దశాబ్ద కాలంగా ఉక్రెయిన్ నేవీకి సేవలు అందిస్తోంది. ఇందులో ఉక్రెయిన్‌కు సంబంధించిన నిఘా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాగా, సింఫెరోపోల్‌ను టార్గెట్‌ చేసిన రష్యా నౌకను ధ్వంసం చేసింది. సముద్ర డ్రోన్‌ సాయంతో రష్యా దళాలు.. నౌకను ధ్వంసం చేశాయి. అయితే, సముద్ర డ్రోన్‌ను రష్యా విజయవంతంగా ఉపయోగించడం ఇదే తొలిసారి అని నిపుణులు చెబుతున్నారు.

ఇక, నౌకపై దాడి కారణంగా అందులో ఉన్న రేడియో, ఎలక్ట్రానిక్, రాడార్, ఆప్టికల్ నిఘా విభాగానికి ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు.. రష్యా దాడిని ఉక్రెయిన్‌ అధికారులు ధృవీకరించారు. ఈ దాడిలో ఒక సిబ్బంది మరణించగా, అనేక మంది గాయపడ్డారని ఉక్రేనియన్ నేవీ ప్రతినిధి చెప్పుకొచ్చారు. ఈ దాడి తర్వాత ఉక్రెయిన్‌ దళాలు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఇక, రష్యాడ్రోన్‌ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)