Breaking News

రష్యా సరిహద్దులో హైటెన్షన్‌.. యూఎస్‌ బాంబర్‌ విమానాలు ప్రత్యక్షం!

Published on Sun, 07/21/2024 - 18:41

మాస్కో: అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ రష్యా, అమెరికా మధ్య ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తమ దేశ సరిహద్దులోకి వచ్చిన అమెరికాకు చెందన బాంబర్‌ విమానాలను రష్యా అడ్డుకుంది. దీంతో, రెండు దేశాల మధ్య ఘర్షణ మరోసారి మొదలైంది.

వివరాల ‍ప్రకారం.. అమెరికాకు చెందిన బాంబర్‌ విమానాలు తమ దేశ సరిహద్దు సమీపంలోకి వచ్చాయని రష్యా ఆరోపించింది. తమ సరిహద్దుకు సమీపించిన రెండు వైమానిక విమానాలను తమ ఫైటర్‌ జెట్లతో అడ్డుకున్నామని రష్యా రక్షణశాఖ వెల్లడించింది. వాటిని అమెరికా వాయుసేనకు చెందిన బీ-52హెచ్‌ వ్యూహాత్మక బాంబర్లుగా తమ సైన్యం గుర్తించిందని తెలిపింది. ఆర్కిటిక్‌లోని బారెంట్స్‌ సముద్రంలో ఈ పరిణామం చోటుచేసుకుందని వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. అమెరికా మాత్రం రష్యా ఆరోపణలను ఖండించింది. అంతర్జాతీయ జలాల మీదుగా విమానాలతో గస్తీ నిర్వహిస్తుండటం సాధారణ ప్రక్రియేనని పేర్కొంది. తటస్థ గగనతలంలో వీటిని చేపట్టామని, అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగానే నడుచుకున్నామని స్పష్టం చేసింది. దీంతో, రెండు దేశాల మధ్య మళ్లీ మాటల యుద్ధం ప్రారంభమైంది. మరోవైపు.. ఇటీవలి కాలంలో అమెరికా పట్ల రష్యా దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై దాడుల సమయంలో నుంచి బైడెన్‌, పుతిన్‌ మధ్య పరోక్షంగా వార్‌ నడుస్తూనే ఉంది. ఇక, రష్యాపై అమెరికా ఆంక్షలు కూడా విధించింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)