Breaking News

ఉక్రెయిన్‌కు రష్యా ఝలక్‌

Published on Wed, 02/12/2025 - 17:32

మాస్కో: ఉక్రెయిన్‌కు రష్యా ఝలక్‌ ఇచ్చింది. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ చేసిన ప్రతిపాదనను మాస్కో వర్గాలు తోసిపుచ్చాయి శాంతి ఒప్పందంలో భాగంగా.. భూభాగాల పరస్పర మార్పిడికి సిద్ధమని జెలెన్‌స్కీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. అందుకు తమ దేశం ఏనాటికీ అంగీకరించబోమని రష్యా ప్రకటించింది.

ఇది ఎన్నటికీ జరగదు. రష్యా తన భూభాగాన్ని మార్పిడి చేసే అంశాన్ని ఎన్నడూ చర్చించలేదు.. చర్చించబోదు కూడా అని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ స్పష్టం చేశారు. రష్యా భూభాగాల్లో అడుగుపెట్టిన ఉక్రెయిన్‌ బలగాలను తరిమి కొట్టడం లేదంటే నాశనం చేస్తుందని పేర్కొన్నారాయన. 

రష్యాతో భూభాగ మార్పిడికి తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు ఉక్రెయిన్‌ భూభాగాలను రష్యా విడిచి పెట్టాలని జెలెన్‌స్కీ షరతు విధించారు. ఈ సందర్బంగా వాటిలో ఏ భూభాగాలను తిరిగి తీసుకుంటారని మీడియా అడగ్గా తమ భూభాగాలన్నీ ముఖ్యమైనవే అన్నారు. ఏవి తిరిగి తీసుకోవాలనే విషయంపై చర్చల అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.అయితే ఈ వ్యాఖ్యలపై చర్చ నడుస్తున్న వేళ.. కీవ్‌పై రష్యా బలగాలు డ్రోన్‌ దాడులు జరపగా ఒకరు మరణించారు. 

మరోవైపు.. రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభం మూడో ఏడాదిలోకి అడుగుపెట్టబోతోంది. ఈ క్రమంలో.. శాంతి చర్చలు జరిగేలా డొనాల్డ్‌ ట్రంప్‌ కృషి చేయాలని జెలెన్‌స్కీ కోరుతున్నారు. తమవద్ద అరుదైన ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నాయని.. వాటివల్ల అమెరికా కంపెనీలకు లాభాలు చేకూరుతాయని చెబుతున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)