Breaking News

పుతిన్‌, కిమ్‌ మధ్య కుదిరిన డేంజర్‌ డీల్‌..

Published on Thu, 12/05/2024 - 08:16

మాస్కో: రష్యా, ఉ‍త్తరికొరియా మధ్య మరో కీలక ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య మిలిటరీ ఒప్పందం అమలులోకి వచ్చింది. ఈ మేరకు నార్త్ కొరియాకు చెందిన అధికారిక న్యూస్‌ ఏజెన్సీ కేసీఏన్‌ఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా రెండు దేశాల మిలటరీ తమకు అవసరమైన సమయాల్లో సాయం చేసుకోనుంది.

రష్యా, ఉత్తర కొరియా మిలిటరీ ఒప్పందం  అమల్లోకి వచ్చింది. పరస్పరం మిలిటరీ సాయం చేసుకోవడానికి ఈ ఏడాది జూన్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్‌ ఉన్‌ ఒప్పందం చేసుకున్నారు. అయితే, పశ్చిమ దేశాలు విధించే ఆంక్షలను సంయుక్తంగా ఎదుర్కోవడం, ఆపత్కాల సమయంలో తక్షణ మిలిటరీ సాయం చేసుకునేలా రెండు దేశాల ఒప్పందం కుదిరింది. ఇక, అణ్వాయుధాలు కలిగిన ఉత్తర కొరియా తన బలగాలను పంపించి రష్యాకు సాయం చేస్తోందని అమెరికా, ఉక్రెయిన్‌ దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో రక్షణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. పుతిన్‌కు సాయం చేసేందుకు రష్యా సైన్యంలోకి నార్త్‌ కొరియాకు చెందిన దాదాపు పది వేల మంది సైనికులను పంపినట్టు అమెరికా ఆరోపించింది.  

మరోవైపు.. రష్యా, కొరియా దేశాల మధ్య జరిగిన ఈ కీలక ఒప్పందానికి ప్రతిఫలంగా మాస్కో.. కిమ్‌కు అధునాతన టెక్నాలజీ అందజేయనుందని వార్తలు వెలువడ్డాయి. పైగా యుద్ధభూమిలో పోరాడటం వల్ల కిమ్‌ సైనికులు రాటుదేలే అవకాశం ఉందని ఆయా దేశాలకు చెందిన నేతలు చెబుతున్నారు. ఇక, ఇప్పటికే వేల సంఖ్యలో నార్త్‌ కొరియా సైనికులు ట్రైనింగ్‌ తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఉక్రెయిన్‌తో రష్యా పోరులో భాగంగా పుతిన్‌కు ఉత్తర కొరియా బలగాలు ఎంతో సాయం చేసే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌పై మరింత ధీటుగా దాడులు చేసేందుకు పుతిన్‌ ప్లాస్‌ చేసినట్టు సమాచారం. 

Videos

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)