Breaking News

ఇప్పుడు పుతిన్‌ వంతు.. త్వరలో భారత్‌కు

Published on Thu, 03/27/2025 - 15:23

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌(Vladimir Putin) భారతదేశ ఆహ్వానాన్ని మన్నించారు. త్వరలో ఆయన భారత్‌కు రానున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ ధృవీకరించారు. ఉక్రెయిన్‌  సంక్షోభం మొదలయ్యాక ఆయన భారత్‌కు వస్తుండడం ఇదే.

నరేంద్ర మోదీ(Narendra Modi) మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టాక రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే పుతిన్‌ను ప్రధాని మోదీ భారత్‌కు ఆహ్వానించారు. అయితే ఆ ఆహ్వానంపై ఇప్పుడు క్రెమ్లిన్‌ వర్గాలు ఒక ప్రకటన చేశాయి. మోదీ మూడోసారి గెలిచాక  మా దేశానికే మొదట వచ్చారు. ఇక ఇప్పుడు మా వంతు. అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత పర్యటన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి అని సెర్గీ ప్రకటించారు. అయితే ఆ పర్యటన ఎప్పుడు ఉంటుందనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

భారత్‌-రష్యా మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉంటాయన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉక్రెయిన్‌ యుద్ధం సైతం దీనిపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. పైగా రష్యా-ఉక్రెయిన్‌(Russia-Ukraine) మధ్య చర్చలు..  శాంతి ఒప్పందం ద్వారానే యుద్ధం ముగుస్తుందని భారత్‌ మొదటి నుంచి చెబుతూ వస్తోంది.

పుతిన్‌ గతంలో చాలాసార్లు భారత పర్యటనకు వచ్చారు. 2000 సంవత్సరంలో అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ఆయన భారత భూభాగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు సదస్సులు, ద్వైపాక్షి ఒప్పందాల కోసం 2004, 2010, 2012, 2014, 2018, 2021లో పర్యటించారు. 

ఇక భారత ప్రధాని హోదాలోనూ నరేంద్ర మోదీ నాలుగుసార్లు రష్యాకు వెళ్లారు. 2015లో బ్రిక్స్‌ సదస్సు కోసం తొలిసారి  అక్కడికి వెళ్లిన ఆయన..  2017, 2019, కాస్త గ్యాప్‌ తర్వాత 2024లో రష్యాలో పర్యటించారు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)