Breaking News

ఐదేళ్ల తర్వాత రష్యాకు మోదీ.. కారణం ఇదే..

Published on Wed, 04/09/2025 - 13:46

మాస్కో: రష్యా ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)ని మాస్కోలో మే 9న జరగబోయే విజయ దినోత్సవ (విక్టరీ డే) పరేడ్‌కు ఆహ్వానించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ సాధించిన విజయానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 80వ విజయదినోత్సవ వార్షికోత్సవం జరగనుంది.

ప్రధాని మోదీని తమ దేశానికి ఆహ్వానిస్తున్నట్లు రష్యా ఉప విదేశాంగ మంత్రి ఆండ్రీ రుడెంకో  తెలిపారు. రష్యా రాజధాని మాస్కో(Moscow)లోని రెడ్ స్క్వేర్‌లో జరిగే ఈ వేడుకలో భారత ప్రధాని పాల్గొనే అవకాశం ఉందని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని రుడెంకో తెలిపారు. 2024 జూలైలో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించారు. ఇప్పుడు ఐదేళ్ల తరువాత మరోమారు మోదీ రష్యాకు వెళ్లనున్నారు. ఈ ఆహ్వానం భారత్-రష్యా లమధ్య దీర్ఘకాల స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశంగా చూడవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రధాని మోదీ రష్యా పర్యటన గురించి భారత ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

రష్యాలో నిర్వహించే విజయ దినోత్సవం  ఆ దేశంలో జరిగే అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ వేడుకలలో ఒకటి. ఈ సందర్భంగా సైనిక పరేడ్, యుద్ధ వీరులకు సన్మానం, చారిత్రక ఘటనలను స్మరించుకునే వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ వేడుకలకు అంతర్జాతీయ నేతలను ఆహ్వానించడాన్ని రష్యా తన సంప్రదాయంగా కొనసాగిస్తోంది. 2005లో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్  రష్యా విజయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: లోకో పైలట్లకు పిడుగులాంటి వార్త.. ‘విరామం’ లేనట్లే!

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు