ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా.. జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు

Published on Sun, 10/26/2025 - 09:15

కీవ్‌: ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌తోపాటు పలు ప్రాంతాలు లక్ష్యంగా రష్యా శుక్రవారం రాత్రి క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగించింది. ఈ దాడుల్లో నలుగురు చనిపోగా, 20 మంది వరకు గాయపడ్డారు. కీవ్‌పై వేకువజామున జరిగిన బాలిస్టిక్‌ క్షిపణి దాడిలో ఇద్దరు చనిపోగా, 13 మంది గాయపడ్డారు. దాడుల్లో ఒక భవనానికి నిప్పంటుకుంది. కూల్చిన క్షిపణి శకలాలు బహిరంగ ప్రదేశంలో పడిపోవడంతో సమీపంలోని వాహనాలు, భవనాల కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు.

నీప్రోపెట్రోవిస్క్‌ ప్రాంతంపై జరిగిన మరో దాడిలో ఇద్దరు చనిపోగా ఏడుగురు క్షతగాత్రులయ్యారు. పలు అపార్టుమెంట్‌ భవనాలు, నివాస గృహాలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. రష్యా ప్రయోగించిన 9 క్షిపణులు, 63 డ్రోన్లకు గాను నాలుగు మిస్సైళ్లు, 50 డ్రోన్లను మధ్యలోనే కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ వైమానిక దళం తెలిపింది.

పేట్రియాట్‌లు కొంటాం: జెలెన్‌స్కీ
నిత్యం భయపెడుతున్న రష్యా దాడుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు వెంటనే పేట్రియాట్‌ రక్షణ వ్యవస్థలను తమకు సమకూర్చాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా, యూరప్, జీ7 దేశాలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా నగరాలకు రక్షణ కల్పించేందుకు అమెరికా నుంచి త్వరలోనే 25 పేట్రియాట్‌ వ్యవస్థల ను కొనుగోలు చేయనున్నామన్నారు. యూకే ప్రధాని కీర్‌ స్టార్మర్‌ అధ్యక్షతన లండన్‌లో జరుగుతున్న యూరప్‌ దేశాల నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఒక వేళ కాల్పుల విరమణ జర క్కుంటే రానున్న రోజుల్లో రష్యా దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని జెలెన్‌స్కీకి వారు హామీ ఇచ్చారు.  

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)