Breaking News

Russia Ukrain war: సొంత గ్రామంపైనే బాంబులు వేసుకున్న రష్యా

Published on Tue, 01/02/2024 - 20:59

మాస్కో: ఉక్రెయిన్‌పై దాడి చేయబోయి దేశంలోని సొంత గ్రామంపైనే రష్యా ప్రమాదవశాత్తు బాంబులు వేసుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ ఆర్మీ నిర్ధారించింది. మంగళవారం(జనవరి 2) ఉదయం తొమ్మిది గంటలకు రష్యా దక్షిణాన ఉన్న వొరొనెజ్‌ ప్రాంతంలోని ఓ  గ్రామంపై రష్యా సైన్యం బాంబులు వేసింది. అయితే ఈ బాంబు దాడుల్లో ఎవరూ చనిపోలేదు.  దాడుల్లో 6 ఇళ్లు మాత్రం దెబ్బతిన్నట్లు రష్యా మీడియా రిపోర్టు చేసింది.

‘బాంబు దాడి ఘటనపై విచారణ ఇప్పటికే ప్రారంభమైంది. బాంబు దాడిలో జరిగిన నష్టంపై అంచనాకు ఒక కమిషన్‌ వేశాం. బాంబు దాడులు జరిగిన ప్రాంతం నుంచి కొంత మందిని వేరే చోటికి తరలించాం’ అని వొరొనెజ్‌ ప్రాంత గవర్నర్‌ ఓల్గా స్కబెయెవా తెలిపారు. అంతకు ముందు ఈ దాడిపై గవర్నర్‌ సోషల్‌ మీడియాలో చేసిన పోస్టులను తొలగించారు. ఈ దాడులు ఉక్రెయిన్‌ ఉగ్రవాదుల పనేనని ఆమె తన పోస్టుల్లో పేర్కొంది. అయితే బాంబులు వేసింది రష్యా సైన్యమేనని నిర్ధారణ అయిన తర్వాత ఆమె పోస్టులను తొలగించారు.   

కొంత కాలం నుంచి కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంలో భాగంగా ఉక్రెయిన్‌లోని నగరాలపై రష్యా తాజాగా బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో అయిదుగురు చనిపోగా 100 మంది దాకా గాయపడ్డారు.ఈ బాంబు దాడుల్లో భాగంగానే రష్యా తన సొంత ప్రాంతంపై తానే బాంబులు వేసుకోవడం గమనార్హం.  

ఇదీచదవండి..ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం.. రెండు విమానాలు ఢీ 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)