Breaking News

దాడి.. అరెస్ట్‌.. ఆందోళన.. లాఠీచార్జ్‌ 

Published on Sun, 06/08/2025 - 06:15

లాస్‌ ఏంజెలెస్‌: చట్టవ్యతిరేకంగా అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను గు ర్తించి, అరెస్ట్‌చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులకు స్థానికుల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవుతోంది. లాస్‌ ఏంజెలెస్‌ నగర పరిసరాలు ఇందుకు వేదికయ్యా యి. శుక్రవారం లాస్‌ ఏంజెలెస్‌ ప్రాంతాల్లో కొందరు అక్రమ వలసదారులను అరెస్ట్‌చేయడం ఒక్కసారిగా ఉద్రిక్తతలకు దారితీసింది. 

ఫెడరల్‌ ఏజెన్సీ, పోలీసులు, ఎఫ్‌బీఐ సంయుక్తంగా జరిపిన ఆకస్మిక దాడుల్లో పలువురు అక్రమవలసదారులను అరెస్ట్‌చేయడంతో అక్కడే ఉన్న స్థానికులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. వీరికి వందలాది మంది విపక్ష డెమొక్రటిక్‌ పార్టీ మద్దతుదారులు, విదేశీయులు తోడవడంతో ఒక్కసారిగా ఆందోళన తీవ్రరూపం దాల్చింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ పోలీసు చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. ఆగ్రహంతో ఊగిపోయిన నిరసనకారులు ప్యాకింగ్‌ కార్ట్‌లు, కాంక్రీట్‌ ముక్కలుసహా దొరికిన వస్తువులతో పోలీసులపైకి దాడికి యత్నించారు. 

దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. వందల మంది నిరసనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. కంటితో చూడలేనంత కాంతిని వెదజ్లే, కళ్లు బైర్లు కమ్మేలా మెరుపులు వెదజల్లే ప్లాష్‌ బ్యాంగ్‌ గ్రనేడ్‌లను విసిరేశారు. దీంతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. నగర వ్యాప్తంగా దావానంలా వ్యాపించిన ఈ అక్రమవలసదారుల ఆందోళనలను అణచివేసేందుకు మరింతగా పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. పలు చోట్ల బ్యారీకేడ్లను ఏర్పాటుచేసి వాహనాల రాకపోకలను నిలిపేశారు.  

మధ్యాహ్నంతో మొదలు 
తొలుత శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు సిటీలోని ఫ్యాషన్‌ డిస్ట్రిక్ట్‌లో ఒక వ్రస్తాల టోకు వ్యాపారిని ఫెడరల్‌ ఏజెంట్లు అరెస్ట్‌చేశారు. ఈ అరెస్ట్‌ను అడ్డుకున్న అక్కడి ఉద్యోగులనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా చూస్తున్న ప్రజల్లో పట్టరాని ఆవేశం పెరిగి ఆందోళనకు దిగారు. పందుల్లారా, పిడివాదం చేసే పోలీసుల్లారా అంటూ కొందరు తిట్ల పురాణం మొదలెట్టారు. 

‘‘కుటుంబాలను వేరు చేస్తూ రాత్రిళ్లు మీరు హాయిగా నిద్రపోగలరా?. మీ కుటుంబసభ్యులను కూడా ఇలా అరెస్ట్‌చేస్తే మీకెలా ఉంటుంది?’’అని అక్కడి ఓ మహిళ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అరెస్ట్‌లను అడ్డుకున్న కార్మిక నేత, సరీ్వస్‌ ఎంప్లాయీస్‌ ఇంటర్నేషనల్‌ యూనియన్‌ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్‌ హుయెరా్టనూ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కారి్మకులు, స్థానికులు మధ్యాహ్నం నాలుగు గంటలకు పెద్ద ఎత్తున గుమిగూడి ఆందోళనకు దిగారు. 

ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ లాస్‌ ఏంజెలెస్‌ ఫెడరల్‌ డిటెన్షన్‌ సెంటర్‌ భవనానికి చేరుకున్నారు. అరెస్ట్‌చేసి లోపల బంధించిన వారిని వెంటనే విడిచిపెట్టాలని నినాదాలుచేశారు. ఫెడరల్‌ కోర్ట్‌హౌస్‌ భవనంపై ఆందోళనకారులు స్ప్రే పెయింట్‌తో రాతలు రాశారు. అనుమతిలేకుండా జనం రోడ్లపై గుమిగూడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు హెచ్చరించినా జనం అక్కడి నుంచి వెళ్లిపోలేదు. దీంతో వీళ్లను చెదరగొట్టేందుకు పోలీసులు పెప్పర్‌ స్ప్రేలు, ఫ్లాష్‌ బ్యాంగ్‌ గ్రనేడ్లను ప్రయోగించారు. ‘‘అక్రమ వలసదారులను అరెస్ట్‌చేయడానికి మేం రాలేదు. శాంతిభద్రతల పరిరక్షణకు వచ్చాం. 

ఇక్కడి నుంచి వెళ్లకపోతే అరెస్ట్‌ తప్పదు’’అని పోలీసుల అధికార ప్రతినిధి డ్రాక్‌ మేడిసన్‌ హెచ్చరించారు. సెంట్రల్‌ లాస్‌ ఏంజెలెస్‌లో మూడు చోట్ల తనిఖీలు, సోదాలను పూర్తిచేశామని అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లోని హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీస్‌ ఇన్వెస్టిగేషన్స్‌ విభాగ మహిళా అధికార ప్రతినిధి యాస్మీన్‌ పిట్స్‌ ఒకీఫ్‌ చెప్పారు. అయితే అధికారులు నగరంలో చాలా చోట్ల ఆకస్మిక దాడులు చేశారని వలసదారుల హక్కుల ఐక్యవేదిక(చిర్లా) పేర్కొంది. ఏడు ప్రాంతాలు, రెండు హోమ్‌ డిపోర్ట్స్, ఒక వేర్‌హౌస్, ఒక డోనట్‌ షాప్‌లో ఈ దాడులు జరిగాయని చిర్లా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఏంజిలికా సలాస్‌ ఆరోపించారు.

44 మంది అరెస్ట్‌ 
సెర్చ్‌ వారెంట్‌ ప్రకా రం 44 మందిని ఫెడరల్‌ ఏజెంట్లు అరెస్ట్‌చేశారు. అరెస్ట్‌లను అడ్డుకున్నందుకు ఒకరిని అరెస్ట్‌ చేశారు. రోజుకు కనీసం 3,000 మంది అక్రమ వలసదారులను అరెస్ట్‌చేయాలని అధ్యక్షభవనం అధికార ప్రతినిధి స్టీఫెన్‌ మిల్లర్‌ ఇమిగ్రేషన్, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాన్ని ఆదేశించడంతో ఫెడ రల్‌ ఏజెంట్లు ఇలా రంగంలోకి దిగాల్సి వచ్చిందని యాస్మీన్‌ పేర్కొన్నారు. ప్రస్తు తం రోజుకు సగటున 1,600 మందిని అరెస్ట్‌చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది తీవ్రమైన నేరాలుచేసిన వాళ్లేనని మిల్లర్‌ చెప్పారు. ఒక వ్యాపారి తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి తప్పుడు పత్రాలను సృష్టించాడని యూఎస్‌ అటార్నీ ఆఫీస్‌ అధికారి సియారన్‌ మెక్‌ఎవీ చెప్పారు. ఇవన్నీ తీవ్రమైన చర్యలని లాస్‌ ఏంజెలెస్‌ మేయర్‌ కరెన్‌ బాస్‌ వ్యాఖ్యానించారు.   
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)