100 ఏళ్లలో తొలిసారి.. స్పీకర్‌ను ఎన్నుకోలేకపోయిన అమెరికా

Published on Wed, 01/04/2023 - 16:39

వాషింగ్టన్‌: అమెరికా ప్రతినిధుల సభలో స్పీకర్ ఎన్నికకు మంగళవారం ఓటింగ్ జరిగింది. మూడు రౌండ్ల బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించినా స్పీకర్ విజయానికి కావాల్సిన మెజార్టీ 218 ఓట్లు రాలేదు. దీంతో సభలో 222 సీట్లున్న రిపబ్లికన్ పార్టీకి షాక్ తగిలింది. స్పీకర్ పదవికి పోటీ పడుతున్న కెవిన్ మెకర్తీకి సొంత సభ్యుల నుంచే వ్యతిరేకత వచ్చింది. దీంతో మంగళవారం మూడు రౌండ్ల ఓటింగ్ జరిగినా ఆయన 218 ఓట్లు సాధించలేకపోయారు. 202 మంది రిపబ్లికన్ ప్రతినిధులు ఆయనకు అనుకూలంగా ఓటు వేయగా.. మరో 20 మంది వ్యతిరేకిస్తున్నారు.

స్పీకర్ ఎన్నికకు జరిగిన తొలి రౌండ్ ఓటింగ్‌లో ఫలితం తేలకపోవడం అమెరికా ప్రతినిధుల సభ చరిత్రలో 100 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరిసారి 1923లో స్పీకర్ ఎన్నికకు నిర్వహించిన తొలి రౌండ్ ఓటింగ్‌లో ఫలితం రాలేదు.

అయితే స్పీకర్ అభ్యర్థికి కావాల్సిన మెజార్టీ వచ్చే వరకు ప్రతినిధుల సభలో ఓటింగ్ నిర్వహిస్తూనే ఉంటారు. ఫలితం వచ్చే వరకు ఎన్ని రౌండ్లయినా ఈ ప్రక్రియ కొనసాగిస్తారు. మంగళవారం మూడు రౌండ్ల ఓటింగ్ జరగగా.. బుధవారం మరోమారు ఓటింగ్ నిర్వహిస్తారు. తాను మళ్లీ రేసులో నిలబడతానని మెకర్తీ స్పష్టం చేశారు. పార్టీ సభ్యులతో చర్చించి అందరూ తనకు మద్దతు తెలిపేలా చూస్తానన్నారు.
అయితే 20 మంది రిపబ్లికన్ సభ్యులు మెకర్తీని వ్యతిరేకిస్తున్నారు. వీరంతా ట్రంప్ సన్నిహితుడు అయిన జిమ్ జోర్డాన్‌కు మద్దతు తెలిపారు. మెకర్తీనే స్పీకర్‌గా ఎన్నుకోవాలని జోర్డాన్ సూచించినా.. వారు మాత్రం వినలేదు. మూడో రౌండ్లోనూ జోర్డాన్‌కు ఓటు వేశారు.

అమెరికా ప్రతినిధుల సభలో ప్రస్తుతం 435 మంది సభ్యులున్నారు. రిపబ్లికన్లకు 222, అధికార డెమొక్రాట్లకు 212 మంది ప్రతినిధులున్నారు. మెజార్టీలో స్వల్ప తేడా ఉండటంతో 20 ఓట్లు చాలా కీలకమయ్యాయి. సభలో మొన్నటివరకు డెమొక్రాట్లదే మెజార్టీ. కానీ ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్లు అధిక సీట్లు గెలుచుకుని సభలో మెజర్డీ సాధించారు.
చదవండి: కిమ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన దక్షిణ కొరియా..!

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)