Breaking News

21 కి.మీ. పరిగెత్తితే 11 కిలోలు తగ్గుతారా?.. దీనిలో నిజమెంత?

Published on Sun, 09/24/2023 - 07:18

శరీర బరువును తగ్గించడంలో రన్నింగ్  సహాయపడుతుందని ఫిట్‌నెస్‌ నిపుణులు చెప్పడాన్ని మీరు వినే ఉంటారు. అయితే ఒక వ్యక్తి కేవలం 21 కిలోమీటర్ల రన్నింగ్ ద్వారా తన  శరీర బరువును 11 కిలోలు తగ్గించుకున్నాడనే సంగతి మీకు తెలుసా? ఇటీవల రష్యాలోని రిపబ్లిక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక వృద్ధుడు రన్నింగ్ ద్వారా 11 కిలోల బరువు తగ్గాడు. ఇందుకోసం ఆ వృద్ధుడు 2 గంటల 50 నిముషాలు పరిగెత్తాడు. 

అయితే వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజానిజాలేమిటో ధృవీకరణ కాలేదు. రష్యన్ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌లో ఉంటున్న 69 ఏళ్ల బహామా ఎగుబోవ్ పేరు 2019లో రష్యన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయ్యింది. అప్పుడు బహామా 5 గంటల పాటు పరిగెత్తి, 9 కిలోలకుపైగా బరువు తగ్గాడు. తాజాగా బహామా ఎగుబోవ్ 21 కిలోమీటర్ల రేసులో పరుగు తీసి, కేవలం రెండున్నర గంటల్లోనే 11 కిలోల బరువు తగ్గాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ ఫీట్‌లో బహామా ఎగుబోవ్ పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు కాలేదు. ఎందుకంటే శరీరానికి హాని కలిగించే ఇలాంటి విజయాన్ని రికార్డ్‌గా పరిగణించరు. త్వరగా బరువు తగ్గేందుకు ప్రయోగాలు చేయడం ప్రాణాంతకం కావచ్చని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత వేగంగా బరువు తగ్గిన వ్యక్తి ని తానేనని బహామా ఎగుబోవ్ చెబుతున్నాడు. ఆడిటీ సెంట్రల్ న్యూస్ వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం బహామా.. జూడో, సాంబో, గ్రీకో-రోమన్ ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో ప్రావీణ్యం సాధించాడు. 

బహామా ఒకప్పుడు యుద్ధాల్లో పాల్గొన్న సమయంలో బరువు తగ్గించే కళను నేర్చుకున్నాడు. తాను తన చిన్నతనంలో యుద్ధాల కోసం 17 కిలోల బరువును తగ్గానని బహామా తెలిపాడు. అయితే వృద్ధాప్యంలో బరువు తగ్గడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. అయినా తాను ఈ ఘనత సాధించానని పేర్కొన్నాడు. పోషకాహార నిపుణుడు ఒక్సానా లైసెంకో మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా రెండు గంటల్లో 11 కిలోల బరువు తగ్గాలంటే, శరీరం నుండి తగినంత ద్రవాన్ని తొలగించాలి. ఇది బహామా ఎగుబోవ్ విషయంలో నిస్సందేహంగా జరిగింది. అయితే సాధారణ వ్యక్తి ఇలాంటి ప్రయోగాలు చేయకూడదని ఆయన హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: భారత్‌- కెనడాల మధ్య చిచ్చుపెడుతున్న గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎవరు?

#

Tags : 1

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)