Breaking News

అరుదైన జాలువారే జలపాతాల ఇంద్రధనుస్సు.. విస్తుపోవడమే తరువాయి!

Published on Sun, 08/27/2023 - 09:30

అమెరికాలోని యోస్మైట్ నేషనల్ పార్క్‌లోని ఓ అందమైన జలపాతానికి సంబంధించిన వీడియో మరోమారు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. బలమైన గాలుల మధ్య జారువారే జలపాతాలలో రంగుల హరివిల్లు ఏర్పడటాన్ని ఈ వీడియో చూడవచ్చు. 

సూర్యోదయం సమయంలో ఈ అద్భుతం ఆవిష్కృతమయ్యింది. సూర్యకాంతిలోని మృదువైన కిరణాలు నీటి బిందువులను తాకినప్పుడు, వాటి వంపు 1,450-అడుగుల ఎత్తయిన జలపాతంలో ఒక మెరిసే ఇంద్రధనస్సు ఆవిష్కృతమయ్యింది. ఈ కాలిఫోర్నియాకు సంబంధించిన పర్వత దృశ్యం 13.7 మిలియన్ల వ్యూస్‌ దక్కించుకుంది. రెండు లక్షలకు మించిన లైక్స్‌ దక్కించుకుంది. యోస్మైట్ కాలిఫోర్నియాలోని నాలుగు వేర్వేరు కౌంటీలలో సుమారు 761,747 ఎకరాల మేరకు విస్తరించి ఉంది. ఇది పరిమాణం పరంగా  అమెరికాలో 16వ అతిపెద్ద జాతీయ ఉద్యానవనం.
 

న్యూస్‌వీక్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఫుటేజీని వాస్తవానికి అవుట్‌డోర్ ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీలో నైపుణ్యం కలిగిన సాల్ట్ లేక్ సిటీకి చెందిన ఫోటోగ్రాఫర్ గ్రెగ్ హార్లో చిత్రీకరించినట్లు నమ్ముతారు. న్యూస్ పోర్టల్ నేషనల్ పార్క్ సర్వీస్ (ఎన్‌ఎస్‌పీ) 2017లో రూపొందించిన డాక్యుమెంటరీ ఫుటేజ్ ఇది అని సమాచారం. సుమారు ఉదయం 9 గంటలకు  బలమైన గాలులు వీస్తున్నప్పుడు ఈ దృశ్యం ఏర్పడింది. 2,400-అడుగుల ఎత్తులో రెయిన్‌బో ఫాల్స్‌ కనిపించాయి.
ఇది కూడా చూడండి: బయట వర్షం.. బస్సులో గొడుగు పట్టిన డ్రైవర్‌!

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)