Breaking News

హమాస్‌పై ఖతార్‌ కీలక నిర్ణయం.. నోటీసులు జారీ

Published on Sat, 11/09/2024 - 10:21

హమాస్‌ గ్రూప్‌ను బహిష్కరించడానికి అంగీకరించినట్లు ఖతార్‌ వెల్లడించింది. దోహాలోనే నివసిస్తూ ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం, బందీల విడుదలకు  హమాస్‌ నేతలు ఆమోదం తెలపని విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో హమాస్‌ నేతలను బహిష్కరించాలని ఖతారకు అగ్రరాజ్యం అమెరికా ఆమోదం సూచించింది. ఈ క్రమంలో అమెరికా విజ్ఞప్తికి ఖతార్‌ అందుకు అంగీకారం తెలిపి.. హమాస్‌కు నోటీసులు పంపించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాల ప్రచురిస్తోంది.

ఇటీవలి కాల్పుల విరమణ, బందీల మార్పిడి ప్రతిపాదనలను హమాస్‌ గ్రూపు తిరస్కరించిన నేపథ్యంలో దోహాలో హమాస్ కొనసాగడం ఆమోదయోగ్యం కాదని అమెరికా ఖతార్‌కు తెలియజేసింది. “ఇజ్రాయెల్‌ బందీలను విడుదల చేయాలనే ప్రతిపాదనలను పదేపదే  తిరస్కరిస్తోంది. హమాస్‌ నేలను ఇకపై ఏ అమెరికన్ భాగస్వామి దేశం తమ రాజధాని నగరాల్లోకి స్వాగతం పలకకూడదు. కాల్పల విరమణను తిరస్కరించిన హమాస్‌ను బహిష్కరించాని  మేం ఖతార్‌కు  స్పష్టం చేశాం’ అని ఓ అమెరికా అధికారి తెలిపారు.మరోవైపు.. అమెరికా విజ్ఞప్తి మేరకు ఖతార్‌ హమాస్‌ను బహిష్కరించటాన్ని హమాస్ నేతలు ఖండించారు.

అమెరికా, ఈజిప్ట్‌తో పాటుగా ఖతార్ దేశాలు.. గాజాలో హింసను అంతం చేయడానికి పలుసార్లు హమాస్‌-ఇజ్రాయెల్‌ చర్చలకు నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. అక్టోబర్‌లో జరిగిన చర్చల్లో  హమాస్ కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించింది. ఇజ్రాయెల్ కొత్త షరతులను ప్రవేశపెట్టడంతో వాటిని తాము ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించమని హమాస్‌ తేల్చిచెప్పింది.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)